37.2 C
Hyderabad
April 26, 2024 21: 47 PM
Slider వరంగల్

దేవరుప్పల పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

#devaruppal

జనగామ జిల్లా దేవరుప్పల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1976 77 సంవత్సరంలో పదో తరగతి చదివిన వారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యా బుద్ధులు నేర్పిన గురువుల సమక్షంలో విద్యా కుసుమాలుగా తీర్చిన దేవాలయంలో గడిచిన మధుర జ్ఞాపకాలను వారు తలచుకున్నారు. గ్రామ సర్పంచ్ బి.రమాదేవి పూర్వ విద్యార్ధులకు తమ గ్రామానికి స్వాగతం పలికారు. దేవరుప్పులలోని అక్షర గార్డెన్ వేదికగా శ్రీరాం సోమయ్య ఈ పూర్వ విద్యార్ధులకు స్వాగతం పలికారు. కార్యక్రమానికి ప్రొ.పే.వీరసోమయ్య అధ్యక్షత వహించారు.

వి.రమేశ్ సమన్వయ కర్తగా సరస్వతి మాతకు జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రార్థనా గీతాలాపాలనతో కార్యక్రమాలు ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్. గోపాల్ రెడ్డి, చంద్రమౌళి, సత్తయ్య, వై.రాంచంద్రయ్య, ఈ.చంద్రారెడ్డి, ఏ. నర్సింహారెడ్డి, కె.వెంకటరెడ్డి, కె.సంజీవ రావు పాల్గొన్నారు. 42మంది పూర్వ విద్యార్థులు తమ జీవిత భాగస్వాములతో కార్యక్రమానికి హాజరు కావడంతో ప్రాంగణం సందడిగా మారింది. అనంతరం 10 మంది గురువులకు తమ జీవిత భాగస్వాములతో పాటు బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛారణతో మంగళమేళాల మధ్య నూతన వ్రస్తాలు, పూలమాలలతో శాలువలు కప్పి సత్కరించారు.

విద్యార్థి బృందాలు ఒక్కో జంటను సన్మానించి మెమోంటోలను అందచేశారు. 60 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్ధులకు శాస్త్రోక్తంగా షష్టిపూర్తి మహోత్సవం నిర్వహించడం ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేకత. కార్తీక మాసమం, శుభ ఘడియలు అయినందున శాస్త్ర ప్రకారంగా బ్రాహ్మణోత్తములచే సుమారు 25మంది విద్యార్థుల జంటలకు షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆహుతులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తారు.

తమకు విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాలకు సుమారు రూ.20,000 సైన్స్ పరికరాలు కొనుగోలు చేసి ఇస్తామని పూర్వ విద్యార్ధులు తెలిపారు. అదే విధంగా ఆట వస్తువులు కొనుగోలు చేసి ఇస్తామని కార్యక్రమ నిర్వహాకులు సభా ముఖంగా ప్రకటించారు. గురువులు ఈ పూర్వ విద్యార్ధులను ఆశీర్వదిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు.

అపురూప ఆత్మీయ అనిర్వచనీయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మధుర స్మృతులు మిగుల్చిందని పూర్వ విద్యార్ధులు అన్నారు. పూర్వ విద్యార్థులలో కొందరు విద్యార్థి దశ నాటి జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. ప్రొ.పి.వీర సోమయ్య, వి.రమేశ్, ఎస్.సోమయ్య, పి.సర్వోత్తమరావు, కె. కరుణామహేందర్ రెడ్డి, బి.చంద్రారెడ్డి, వైపుల్ రెడ్డి, సిహెచ్ సోమయ్య, ఎన్. అంజయ్య,  జి.శోభ, కె.పద్మావతి, కె.సుజాత కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు.

Related posts

అంబేడ్కర్ విగ్రహాన్ని తరలించాలనే కుట్రను విరమించుకోవాలి

Satyam NEWS

ఆర్ కృష్ణయ్యకు విన్నపం ఒక పోరాటం వినతి పత్రం

Satyam NEWS

నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment