37.2 C
Hyderabad
May 2, 2024 14: 02 PM
Slider ప్రత్యేకం

అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతిచ్చిన డీజీపీ

#APDGP

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రకు డీజీపీ సవాంగ్‌ అనుమతి మంజూరు చేశారు. ముందుగా పాదయాత్రకు డీజీపీ అనుమతి తిరస్కరించగా హైకోర్టు సూచనల మేరకు ఆయన అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. ఇందుకోసం పాదయాత్రకు 20 షరతులతో డీజీపీ అనుమతి ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. గుంటూరు అర్బన్‌, రూరల్‌, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్‌ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డీజే సౌండ్లు, బహిరంగసభలు నిర్వహించొద్దని డీజీపీ పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎన్నికల కోడ్‌ పాటించాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రలో 157 మందికి మించి పాల్గొనకూడదని డీజీపీ ఆదేశించారు. రైతుల పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని డీజీపీ షరతు విధించారు. ప్రతి రోజు ఉ.6 గంటల నుంచి సా.6 గంటలలోగా పాదయాత్ర ముగించాలని డీజీపీ సవాంగ్‌ ఆదేశించారు

Related posts

ఎన్టీఆర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Bhavani

లాక్ డౌన్ ను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

Satyam NEWS

వనపర్తి జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment