42.2 C
Hyderabad
April 26, 2024 16: 34 PM
Slider ఆదిలాబాద్

ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

#Nirmal Collector

ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధరణీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలన్నారు.

మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పై శిక్షణ తరగతులు నిర్వహించి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 526 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. సులభంగా, వేగవంతంగా సేవలందించాలని సూచించారు.

సమావేశంలో జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, బైంసా ఆర్డివో రాజు, తాహసిల్దార్ లు సుభాష్ చందర్, నరేందర్, విశ్వంభర్, ప్రభాకర్, శ్రీకాంత్, శివకుమార్, కిరణ్మయి, ఈ డి ఎం నదీం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ నెల 23న వస్తున్న ‘భారీ తారాగణం’

Bhavani

చింతమడకలో ఇంటికి 10 లక్షలు- మరి మాకో?

Satyam NEWS

మహిళల న్యూడ్  ఫొటోస్ రికార్డ్ సంఘటన పై విచారణ

Satyam NEWS

Leave a Comment