38.2 C
Hyderabad
April 29, 2024 13: 42 PM
Slider శ్రీకాకుళం

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

#municipal workers

మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేసి,కనీస వేతనం రూ.26000/- లు అందించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏ.ఐ.టి.యు.సి.అనుబంధం) డిమాండ్ చేసింది. శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు శుక్రవారం నాడు ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్మికులకు పర్మినెంట్ చేసి,కనీస వేతనం రూ.26000/- లు అందించాలని,సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని,కార్మికులకు జీ.పి.ఎఫ్.ఖాతాలు ఓపెన్ చేయాలని,పది లక్షల రూపాయిలు ప్రమాద బీమా అమలుకు చేయాలని,సహజ మరణం పొందిన కార్మిక కుటుంబాలకు అయిదు లక్షలు పరిహారం అందించాలని,కార్మికుల కుటుంబాలకు ఆరోగ్య భీమా వర్తింప చేయాలని,ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు నినదించారు.

అనంతరం ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పల రాజు,గౌరవ అధ్యక్షులు కొమర భాస్కర రావు, ఏ.ఐ.టి.యు.సి.జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖ రావు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి నాలుగున్నర ఏళ్ళు అయినా అమలు చేయకపోవడం ఆందోళనకరమని అన్నారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలని కోరారు.

కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్, డ్రైవర్లు, క్లాప్ డ్రైవర్స్,నగర దీపి,పార్కుల్లో పని చేసే కార్మికుల సమస్యలు పరిష్కారించి పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ కు మరో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.టి.యు.సి.ముఖ్య సలహాదారు చిక్కాల గోవింద రావు,అధ్యక్షులు మాడుగుల రాఘవ,ఆర్గనైజింగ్ కార్యదర్శి రామవాస గణేష్,అర్జీ పెద్ద మణి,వైస్ ప్రెసిడెంట్ అరుగుల రాంబాబు,కార్యదర్శి అరుగుల రమణ,కోశాధికారి అర్జీ పోలావతి, కళ్యాణి రామ చంద్రరావు, కె.తారకేశ్వర రావు,ఎస్. కె.రసూల్, టి.నారాయణ రావు,కళ్యాణి సరస్వతి, యండ కోటేశ్వర రావు,అరుగుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హౌస్ అరెస్ట్

Satyam NEWS

ఇది నిజంగా విక్రమ్‌ లాండరేనా

Satyam NEWS

సీఎం కేసీఆర్ డిమాండుకు స్పందించిన కేంద్రం

Satyam NEWS

Leave a Comment