28.7 C
Hyderabad
April 28, 2024 07: 16 AM
Slider మహబూబ్ నగర్

డిజిటల్ క్లాసులు ప్రారంభించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్

#DegitalClasses

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం డిజిటల్ క్లాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం మాట్లాడుతూ సాంప్రదాయక విద్యతో పాటు ఆన్లైన్ తరగతులు డిజిటల్ క్లాసులు నిర్వహణ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

వివిధ సబ్జెక్టులతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో అత్యధికంగా విద్యార్థుల్ని కళాశాలలో చేర్పించారని కొనియాడారు. చక్కటి విద్యా బోధనతో పాటు ఉత్తీర్ణత శాతాన్ని  పెంచి కళాశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1000 చెట్లను బాధ్యతగా పెంచారని జిల్లాలోనే గ్రీన్ గిఫ్ట్ సాధించించారని,సదానందం గౌడు కృషి, పట్టుదలను అభినందించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన కల్వకుర్తి పారిశ్రామికవేత్త జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు, సత్ప్రవర్తన, అంకితభావం, దేశభక్తి, పట్టుదల, ఆటల్లో రాణించేలా పెంచుతున్నారని అన్ని రంగాల్లో కళాశాల అధ్యాపకుల కృషి అభినందనీయమని కొనియాడారు.

కళాశాలలో సమస్యల పరిష్కారానికి  పూర్వ విద్యార్థిగా నా వంతు కృషి చేస్తామని యడ్మ సత్యం  రమేష్ బాబు హామీ ఇచ్చారు. ఫలితాల్లో ప్రథమ స్థానం తో పాటు కళాశాలలో పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించి నందుకు పూల సుధాకర్ అధ్యాపకులని అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, వాసవి క్లబ్ సెక్రటరీ చిగుళ్ల పల్లి శ్రీధర్, ఉపాధ్యాయులు గణేష్ గౌడ్ మల్లేష్ సదానందం గౌడ్ శ్రీనివాస్ పరుశురాం నయీమ్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేవుళ్ల‌ను అవ‌మానించి వాళ్ల‌ను తిరిగి దూషిస్తే..నేర‌మెలా అవుతుంది….?

Satyam NEWS

మల్దకల్ మండల బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

Satyam NEWS

తిరుమల శ్రీవారి సేవలో బేతి , పన్నాల

Satyam NEWS

Leave a Comment