28.7 C
Hyderabad
April 26, 2024 09: 19 AM
Slider ప్రత్యేకం

దిశ యాప్: 21 నిమిషాల్లో 25 కిలోమీటర్ల దూరానికి పోలీసులు

#vijayanagarampolice

‘దిశ’ యాప్ డౌన్ లోడ్ ఫలితంగా పదిగంటల వ్యవధిలో అదీ 21 నిమిషాలలో 25 కిలోమీటర్ల దూరం వెళ్లిన ఇద్దరు పోలీసులు బాధితులు వద్దకు చేరారు. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం విజయనగరం  చౌడువాడ లో జరిగిన హత్యాయత్నం కేసు పూర్వపరాలను జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ డీపీఓలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

తెల్లవారి 2గంటల సమయంలో గాలి రాములమ్మ, బాకి సంతోషి, బాకి అరవింద్ ల పై పెట్రోలు పోసి, నిప్పు పెట్టి, హత్యాయత్నం చేసిన నిందితుడు ఆళ్ళ రాంబాబును కేవలం 10గంటల వ్యవధిలో అరెస్టు చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం. దీపిక వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – నిందితుడు ఆళ్ల రాంబాబుకు బాధితురాలు గాలి రాములమ్మకు మనస్పర్ధలు రావడంతో వివాహం చేసుకొనేందుకు రాంబాబు నిరాకరించాడు. ఈ కారణంతో వారు పూసపాటిరేగ పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇరు కుటుంబాలకు రెండు నెలలు క్రితం కౌన్సిలింగు నిర్వహించడం, రాంబాబు వివాహం చేసుకుంటానని చెప్పడంతో, ఇరు కుటుంబాలు రాజీ పడడం జరిగిందన్నారు.

అనంతరం, రాములమ్మ పై అనుమానంతో రాంబాబు మళ్ళీ పెండ్లి చేసుకోవడానికి నిరాకరించడం, ఆమెను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో చౌడువాడ గ్రామంకు వచ్చి, నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి, నిప్పు పెట్టడంతో, వారికి తొడల దిగువ భాగంన కాలిన గాయాలయ్యాయన్నారు.

ఈ సంఘటన జరిగిన తరువాత ధనలక్ష్మి అనే ఆమె దిశా ఎస్ఓఎస్ కు ఆగస్టు 20, తెల్లవారి 03-07 గంటల సమయంలో ఫిర్యాదు చేయడంతో, అప్రమత్తమైన పోలీసులు కాని స్టేబులు దామోదర్, హోం గార్డు సత్యన్నారాయణ బీటు డ్యూటీ నిర్వహిస్తూ, వర్షం పడుతున్నా, తడుచుకుంటూ, కేవలం 21నిమషాల వ్యవధిలో సుమారు 25 కి.మీ.లు ప్రయాణించి, సంఘటనా స్థలంకు చేరుకున్నారన్నారు.

వెంటనే, వారు కాలిన గాయాలతో ఉన్న ముగ్గురు బాధితులను ఆటోలో భోగాపురం సీహెచ్ సీ కి చికిత్స నిమిత్తం తరలించారన్నారు.

సీహెచ్ సీలో ప్రాధమిక చికిత్స నిర్వహించిన తరువాత 108 వాహనంలో మెరుగైన చికిత్స కొరకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసామన్నారు. పూసపాటిరేగ ఎస్ఐ జయంతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితుడి గురించి గాలింపు చేసి సంఘటన జరిగిన 10 గంటల వ్యవధిలోనే కృష్ణాపురం వద్ద నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు.

నిందితుడి కుటుంబ సభ్యుల ప్రోత్సహంతోనే రాంబాబు హత్యాయత్నంకు పాల్పడ్డాడని బాధితురాలు రాములమ్మ చెప్పినందున, ఆ కోణంలో కూడా దర్యాప్తు నిర్వహించి, నిజంగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లయితే ఎవ్వరినీ ఉపేక్షించమని, వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు.

అంతేకాకుండా, ఈ కేసులో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, 7 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

రాములమ్మ సోదరి ధనలక్ష్మి మొబైల్ ఫోనులో దిశా (ఎస్ఓఎస్) యాప్ ఉండడం వలనే, వారు అర్ధరాత్రి అయినప్పటికీ పోలీసులకు సమాచారం అందించగలిగారన్నారు. అదే విధంగా పోలీసులు కూడా సకాలంలో సంఘటనా స్థలంకు చేరుకొని, బాధితులను రక్షించ గలిగారన్నారు.

ప్రజలంతా తప్పనిసరిగా తమ మొబైల్ ఫోనుల్లో దిశా ఎఓఎస్ యాప్ ను డౌనులోడు చేసు కోవాలని, ఆపద సమయంలో యాప్ లోని ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసి, పోలీసుల సహాయం పొందాలని జిల్లా ఎస్పీఎం. దీపిక ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Related posts

ఇది 50 % కమిషన్ ప్రభుత్వం

Satyam NEWS

గంధపు విగ్రహాలకు వైభవంగా అంబలం పూజ..

Satyam NEWS

ప్రకాశం జిల్లా సమస్యలపై ప్రధాని సానుకూల స్పందన

Satyam NEWS

Leave a Comment