35.2 C
Hyderabad
April 27, 2024 12: 27 PM
Slider మహబూబ్ నగర్

సమయం వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి

#deo

పదవ తరగతి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలో ని మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన  పాఠశాలల మౌళిక సదుపాయాల కల్పన పనులు, విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించేందుకు తనిఖీ చేసేందుకు  డిఈవో తెలకపల్లి, పెద్దకొత్తపల్లి  మండలాల్లోని గౌ రెడ్డి పల్లి తెలకపల్లి పెద్దూరు ముష్టిపల్లి మరికల్ పెద్దకొత్తపల్లి ప్రాథమిక  ఉన్నత   పాఠశాలాలను ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ  సందర్భంగా డిఈవో  పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి విద్యార్థిలో తనదైన ఒక శక్తి సామర్థ్యం ఉంటుందని ఉపాధ్యాయులు బోధించే సందర్భంలో  విద్యార్థుల శక్తి సామర్థ్యాలను గుర్తించి వెలికి తీయడమే కాకుండా అందులో వారిని మరింత ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. 

పాఠశాలకు విద్యార్థులు ప్రతి రోజు వచ్చేటట్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల లో 3, 4, 5 వ తరగతి విద్యార్థులతో  ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. ప్రతి విద్యార్ధికి యాక్షన్ ప్లాన్ ను తయారు చేయాలని అప్పుడే విద్యార్ధి యొక్క సామర్థ్యాలు తెలుస్తుందన్నారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. వంట గదిని, అక్కడి పరిశుభ్రతను పరిశీలించారు.

విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించారు.  కోడి గుడ్లను మెనూ ప్రకారం ఇవ్వాలన్నారు.  10వ తరగతి విద్యార్థులతో మమేకమై వారానికి ఒకసారి వారికి టెస్ట్ లను పెడుతున్నారా అని ఆరాతిశారు. సాయంత్రం సమయం లో వారికి ప్రతి రోజు ఓ సబ్జెక్టు పై స్టడీ అవర్స్ నిర్వహిస్తూ అల్పాహారాన్ని పెడుతున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరంలో  10వ తరగతి విద్యార్థులందరు  10/10 సాధించాలని విద్యార్థులకు  సూచించారు. విద్యార్థులు తప్పని సరిగా 10/10 సాధిస్తామని జిల్లా డిఈవో కు హామీ ఇచ్చారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా అంకితభావంతో పది పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

ఆయా పాఠశాలల్లో మన ఉరు మన బడి కార్య క్రమం లో భాగంగా చేపట్ట వలసిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలనీ  వాటర్ సంపు, లైటింగ్, ప్రహరి గోడల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ ఆదేశించారు.

పెద్దకొత్తపల్లి కే జి బి విలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కేజీబీవీలో పరిసరాలను పరిశీలించి, నాణ్యమైన రుచికరమైన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వస్తువులను కల్పించాలని యస్.ఓను ఆదేశించారు. డీఈఓ వెంట మండల విద్యాధికారి చంద్రుడు నాయక్ ఉన్నారు.

Related posts

రాజధాని గ్రామాల మహిళలపై పోలీసు దాడి అమానుషం

Satyam NEWS

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిక

Murali Krishna

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ మధ్యవర్తిత్వం?

Satyam NEWS

Leave a Comment