33.7 C
Hyderabad
April 30, 2024 00: 51 AM
Slider చిత్తూరు

నగరి మున్సిపాలిటీలో మంత్రి రోజాకు మంగళహారతులు

#roja

నగరి మున్సిపాలిటీలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. టి ఆర్ కండ్రిక సచివాలయం పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి రోజాకు స్థానికులు మంగళహారతులు పట్టారు. నగరి మున్సిపాలిటీ 7వ వార్డ్ నగరి టి ఆర్ కండ్రిక సచివాలయం పరిధిలలో బుగ్గ కండ్రిక ఏఎన్ కండ్రిక గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను గురించి మంత్రి ఆరా తీశారు. గ్రామంలో కాలి నడకన పర్యటించిన మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలుపై ప్రజలను అడిగి కొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులను  మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ వివరిస్తూ మళ్లీ జగనన్న ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు, డీలు ఏయిలు కౌన్సిలర్లు కో ఆప్షన్ నెంబర్లు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు వాలంటరీ సిబ్బందిలు సచివాలయ సిబ్బందిలో తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్న మావో నేత

Sub Editor 2

మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ కారుపై దాడి

Satyam NEWS

త్వరలో ఏపి  విశాఖ లో బిఆర్ యస్ సభ

Satyam NEWS

Leave a Comment