42.2 C
Hyderabad
April 26, 2024 16: 39 PM
Slider హైదరాబాద్

అణగారిన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

ambedkar 141

అణగారిన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని బీసీ సంక్షేమం సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వెదురాడ జాన్సీ అన్నారు. రాజ్యాగ నిర్మాత డా. బీఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి పురస్కరించుకొని తన నివాసం లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అణగారిన వర్గాలకోసం తన అసమాన ప్రతిభతో భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు.రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చూపిన విజ్ఞత ఎంత పొగిడినా తక్కువేనన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి చేసిన సేవలు అజరామరమైనవన్నారు. నేడు బి‌సి,ఎస్సి,ఎస్టి వర్గాలు ఈ మాత్రం అభివృద్ధి లో ఉన్నాయంటే అది ఆయన పుణ్యమే నాన్నారు.

దళితుల పట్ల నాటి సమాజంలో ఉన్న సామాజిక వివక్షను అరికట్టడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. డాక్టర్ అంబేద్కర్ తన జీవితాన్ని పేదలు, అణగారిన, దిగువ తరగతి కులాల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేశారన్నారు. ప్రదాన మంత్రి నరేంద్ర మోడి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ పాటించాలని జాన్సీ విజ్ఞప్తి చేశారు.

Related posts

మంత్రి కొడాలి నానిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఎన్నికల కమిషనర్

Satyam NEWS

గృహలక్ష్మి ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్ధిక సాయం

Bhavani

సిబిఐటి కళాశాల లో  జాతీయ సైన్స్ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment