34.3 C
Hyderabad
April 16, 2021 14: 04 PM
Slider సినిమా

హెచ్ డి అనుభవం పై స్టార్ ఇండియా ప్రచార చిత్రం

#starHD

అసలైన హెచ్‌డీ అనుభవం అంటే ఏమిటో తెలుసుకోండి అంటూ స్టార్‌ ఇండియా రియల్‌ హెచ్‌డీ ఎక్స్‌పీరియన్స్‌ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. హెచ్‌డీటీవీ, హెచ్‌డీ సెట్‌ టాప్‌ బాక్స్‌ (ఎస్‌టీబీ) కలిగి ఉండి కూడా తమ అభిమాన స్టార్‌ ఛానెల్స్‌ను స్టాండర్డ్‌ డెఫినేషన్‌ (ఎస్‌డీ)లోనే వీక్షిస్తున్న టెలివిజన్‌ ప్రేమికులకు దీని ద్వారా అవగాహన కల్పించనున్నారు.

వినియోగదారులు తరచుగా హెచ్‌డీ టీవీ ఉంటే చాలు అది తమకు పూర్తిగా హెచ్‌డీ వీక్షణ అనుభవాలను అందిస్తుందని భావిస్తుంటారు. అది అపోహ మాత్రమే అని ఈ ప్రచారం ద్వారా తెలిపేందుకు లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా వినోదాత్మకంగా దీనిని తెలుపుతున్నాం. 

స్టార్‌ ఇండియా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం కేవలం 25% మంది వినియోగదారులకు మాత్రమే హెచ్‌డీ టీవీ, హెచ్‌డీ సెట్‌ టాప్‌ బాక్స్‌తో పాటుగా హెచ్‌డీ ఛానెల్స్‌కు సైతం సబ్‌స్ర్కిప్షన్‌ కలిగి ఉన్నప్పుడు మాత్రమే సమగ్రమైన హెచ్‌డీ వీక్షణ అనుభవాలను పొందగలమని తెలుసు.

స్టార్‌ హెచ్‌డీ ఛానెల్స్‌ ఫీచర్లు అయిన విస్తృతస్థాయి చిత్రం, ఐదు రెట్ల షార్పర్‌ పిక్చర్‌, 5.1 డాల్బీ సరౌండ్‌ సౌండ్‌ వంటివి వీక్షణ అనుభవాలను మరింత ఉన్నతంగా లీనమయ్యే రీతిలో మలుస్తాయని, ‘తాకీ ఆప్కా హెచ్‌డీ టీవీ సిర్ఫ్‌ దిఖానే కే లియే హీ నహీ, దేఖ్‌నే మై భీ రియల్‌ హెచ్‌డీ ఎక్స్‌పీరియన్స్‌ దే !’ (తద్వారా, మీ హెచ్‌డీ టీవీ కేవలం చూపించడం కోసం మాత్రమే కాదు, చూడటంలోని  అసలైన అనుభవాలను కూడా ఇస్తుంది!)అని చెబుతుంది.

గుర్జీవ్‌ సింగ్‌ కపూర్‌, అధ్యక్షులు– టీవీ డిస్ట్రిబ్యూషన్‌, ఇండియా అండ్‌ ఇంటర్నేషనల్‌, స్టార్‌ అండ్‌ డిస్నీ ఇండియా మాట్లాడుతూ ‘‘ స్టార్‌ ఇండియా వద్ద తామెప్పుడూ సాటిలేని వినోద అనుభవాలను, విలువను మా వీక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తుంటాము.

విభిన్నమైన శైలి, భాషలలో 26కు పైగా స్టార్‌ హెచ్‌డీ ఛానెల్స్‌ యొక్క అతిపెద్ద పోర్ట్‌ఫోలియోతో మా కంటెంట్‌తో అనుబంధాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అద్భుతమైన ప్రత్యక్ష క్రికెటింగ్‌ క్యాలెండర్‌తో పాటుగా వివో ఐపీఎల్‌ 2021 సమీపంలోనే ఉంది. మా వినియోగదారులు అద్వితీయమైన అనుభవాలను, స్టేడియంలో ఉన్నట్లుగా అనుభూతులను మా హెచ్‌డీ ఛానెల్స్‌ ద్వారా పొందాలని కోరుకుంటున్నాం.

స్టార్‌ హెచ్‌డీ ఛానెల్‌ సబ్‌స్ర్కిప్షన్‌తో తమ వీక్షణ అనుభవాలను వృద్ధి చేసుకునేందుకు వినియోగదారులకు ఇది అత్యుత్తమ సమయం. అందువల్ల, ఈ ప్రచారంతో అవగాహన లేమిని పోగొట్టడంతో పాటుగా తమ స్టార్‌ హెచ్‌డీ ఛానెల్స్‌ను రీచార్జ్‌ చేసుకోవడంలోని ఔచిత్యం గ్రహించేందుకు సైతం తోడ్పడుతుంది’’ అని అన్నారు.

ఈ ప్రచారాన్ని అద్భుతంగా నేపథ్యీకరించిన చిత్రం ద్వారా తెలుపుతున్నారు.  దీనిలో తమ సహజమైన ప్రయోజనం కోసం వినియోగించకుండా  ప్రదర్శన విలువ కోసం వారి ఇళ్లలో వస్తువులను ఉంచే ప్రజల సహజమైన అలవాటును ప్రదర్శిస్తూ ఇది ఉంటుంది.

ఓ ఫ్యాన్సీ, ఫ్లాట్‌ స్ర్కీన్‌ హెచ్‌డీ టీవీని సొంతం చేసుకోవడమనేది ఓ వ్యక్తి సామాజిక స్థితిని పెంచే విషయం. ఈ ప్రచారం ద్వారా స్టార్‌ ఇండియా హెచ్‌డీ ఛానెల్స్‌కు  చందా చేసుకోవడం  కోసం మీ  హెచ్‌డీ ఛానెల్స్‌ పేరును మరింతగా ప్రకాశింపజేయండి అంటూ వినోదాత్మకంగా చెబుతుంది.  ఈ ప్రచారంలో స్టార్‌ ఇండియా నెట్‌వర్క్‌ నుంచి ఎక్కువ మంది ప్రేమించే క్యారెక్టర్లు సైతం రియల్‌ హెచ్‌డీ అనుభవాలను ప్రచారం చేయనున్నారు.

Related posts

మహమ్మారి వ్యాపించకుండా కట్టు దిట్టమైన చర్యలు

Satyam NEWS

మానవ మనుగడకు పచ్చని చెట్లే ఆధారం…!

Satyam NEWS

అత్యాచారం హత్యకు గురైన దేవిక కుటుంబాన్ని ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!