స్థానిక విద్యుత్ అవసరాలను తీర్చేందుకు వీలుగా 33/11కేవి విద్యుత్ సబ్ స్టేషన్ కు నేడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్ పల్లి గ్రామంలో విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.
విద్యుత్ సబ్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్మన్ తీగల అనిత రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.