42.2 C
Hyderabad
April 26, 2024 15: 58 PM
Slider వరంగల్

ఉపాధి హామీ కూలీలకు పెరిగిన వేతనం

#EmploymentGarenteeScheme

ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీలకు వేతనాలు పెరిగాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పెరిగిన వేతనాలు వస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఆయన నేరుగా కూలీలతోనే మాట్లాడి తెలుసుకున్నారు.

జనగామ జిల్లా లింగాల ఘన్ పూర్ మండలం కుందారం గ్రామం లో ఆయన ఉపాధి హామీ కూలీల తో మాట్లాడారు. పెరిగిన వేతనాల గురించి మంత్రి వారికి వివరించారు. ఈ పెరిగిన వేతనాలు ఏప్రిల్ నెల నుంచే వస్తాయని కూడా కూలీలకు మంత్రి వివరించి చెప్పారు.

ఉపాధి కూలీలకు వ్యవసాయ పనులకు అనుబంధం చేయాలని సీఎం కెసిఆర్, తాను కేంద్ర ప్రభుత్వానికి తెలిపామని మంత్రి చెప్పారు. కష్ట కాలంలో కూలీలకు కరువు పనులు ఎంతో మేలు చేస్తాయని మంత్రి వివరించారు. పనులు చేసే సమయంలో కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పనులు చేసే సమయం లో సామాజిక దూరం పాటించాలని వారికి వివరించారు.

Related posts

ఐదు గురు వరంగల్ వాసుల మృతదేహాలు లభ్యం

Satyam NEWS

ఆర్ధికంగా దివాలా తీయడానికి కారణం మీరు కాదా?

Satyam NEWS

టోల్గేట్ సిబ్బందిపై చేయిచేసుకున్న వైసీపీ లేడీ లీడర్

Satyam NEWS

Leave a Comment