Slider వరంగల్

జర్నలిస్టులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Tarigoppula

జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఎంపీపీ జొన్న గొని హరిత సుదర్శన్ గౌడ్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు శనివారం నాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్ డి ఓ మధుమోహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆర్ డి ఓ మధుమోహన్ మాట్లాడుతూ కనిపించని శత్రువుతో మనం పోరాటం చేస్తున్నాం ప్రాణం కంటే విలువైనది ప్రపంచంలో ఏం లేదు స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరం పాటిద్దాం అని అన్నారు. అయితే కొందరు లాక్ డౌన్ పట్టించుకోవడం లేదని, రోడ్డుపైన ఉమ్మి వేయరాదంటే వినడం లేదని, మాస్కులు ధరించడం లేదని ఆయన అన్నారు.

 రేయి పగలు అని లేకుండా పోలీసులు డాక్టర్లు పారిశుద్ధ కార్మికులు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు పని చేస్తున్నారని కొనియాడారు.  జర్నలిస్టులకు బియ్యం నిత్యావసర సరుకులను అందించిన ఎంపీపీ ని అభినందించారు, ఈ సందర్భంగా ఎంపీపీ జొన్న గొని హరితా సుదర్శన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తన వంతు బాధ్యతగా సహకరించాలని ఉద్దేశంతో నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

సమాజంలో అందరికీ ఉపయోగపడే జర్నలిస్టులకు సహకరించడం ఆనందంగా ఉందన్నారు. కరోనా వైరస్ తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సమదూరం పాటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి ముద్దసాని పద్మజా వెంకటరెడ్డి తాసిల్దార్  స్వప్న ఎంపీడీవో రాధా కృష్ణ కుమారి వైస్ ఎంపీపీ చెన్నూరి ప్రమీల సంజీవ ఎంపీవో మల్లయ్య సర్పంచ్ దామెర ప్రభుదాస్ కార్యదర్శి రామారావు తెరాస మండల అధ్యక్షుడు పింగళి జగన్మోహన్ రెడ్డి, అర్జుల సుధాకర్ రెడ్డి, చిలువేరు లింగం అంకం రాజారాం భూక్య రవి టోనీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్న నిమ్మగడ్డ

Satyam NEWS

అశోక్ బంగ్లాలో రాజా వారి 73 ఏళ్ల పండగ….!

Satyam NEWS

టీడీపీలో చేరిన పాడేరు నియోజకవర్గ వైసీపీ సర్పంచులు

Satyam NEWS

Leave a Comment