40.2 C
Hyderabad
April 26, 2024 11: 04 AM
Slider ప్రత్యేకం

తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని చీల్చేయాలని చూశాడు

#TRSHujurabad

తెరాస పార్టీతో లాభం పొందుతూ వేల కోట్లు సంపాదిస్తూ పార్టీని చీల్చి పార్టీని నాశనం చేయాలని ఈటల రాజేందర్ చూసాడని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మి కాంతా రావు అన్నారు. సింగాపురం లోని ఆయన నివాసం లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ఈటెల ను సొంత సొదరునిలా  చూసాడని అన్నారు.

వేల కోట్ల రూపాయల నిధులు అడగ్గానే నియోజక వర్గ అభివృద్ధికి కేటాయించారని కెప్టెన్ తెలిపారు. ఈటెల అత్యాశ, దురాశ కు పోయాడని కెసిఆర్ పట్ల చాలా మంది అసంతృప్తి తో ఉన్నారని ప్రచారం చేయడం తగదని అన్నారు. 66 ఎకరాల అసైన్డ్ , ప్రభుత్వ భూమినీ మంత్రిగా ఉంటూ ఆక్రమించడం పద్దతి కాదని, దీనిపై కేసీఆర్ స్పందించి విచారణకు ఆదేశిస్తే అది తప్పు ఎలా అవుతుందని కెప్టెన్ ప్రశ్నించారు.

బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి భూములపై సొంత, వ్యక్తిగత లాభం కోసం కన్నేయడం తప్పు అన్నది ఒక మంత్రిగా ప్రాధమికంగా తెలుసుకోవాల్సిన అంశం అని అన్నారు. అవి ఎలాంటి భూములైనా వాటి పరిధిలోని వెళ్లడం చట్ట వ్యతిరేకం అని అన్నారు. ఈటెల మేక వన్నె పులి అని, తను ఎంతో నమ్మకంతో అవకాశం కల్పిస్తే తనకే వెన్ను పోటు పొడిచిన వ్యక్తి ఈటెల అని అన్నారు.

వెనుక గోతులు తవ్వుతూ ముందు నవ్వులు పూ యించే ఈటెల

వెనుక గోతులు తవ్వుతూ ముందు నవ్వులు పూ యించే ఈటెల హుజురాబాద్ ఎంపీపీ గా ఉన్న తన భార్య వొడితల సరోజినీ దేవి పై  అవిశ్వాసం పెడితే చూస్తూ ఉండిపోయాడే తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం  చేయలేదనీ అన్నారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించి హుజురాబాద్, జమ్మికుంటలోని మున్సిపాలిటీల్లో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను ప్రోత్సహించారని అన్నారు.

పార్టీలో కష్టపడి పనిచేస్తున్నవారిని అణగదొక్కడం, బయటి వారిని ప్రోత్సహించడం ఈటెల కు అలవాటు అని, పార్టీలో ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి ఫోటోలు ఫ్లెక్సీల్లో  పెట్టవద్దని కార్యకర్తలను ఈటెల హెచ్చరించేవారనీ అన్నారు.

నిజానికి టీఆరెస్ పార్టీ నిర్మాణం సి ఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2001 లో అప్పటి కమలాపూర్ నియోజకవర్గంలో తమ ఆధ్వర్యంలోనే జరిగిందనీ, అప్పటి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని బలమైన పార్టీగా ఆ నియోజకవర్గంలో టీఆరెస్ అవతరించిందనీ ఆయన అన్నారు. తదనంతరమే అంటే 2004 లో ఈటల రాజేందర్ టీఆరెస్ పార్టీలోకి వచ్చారనీ ఆయన అన్నారు.

సి ఎం కేసీఆర్ ఈటల రాజేందర్ కు టీఆరెస్ పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చారనీ, అయన ఈ స్థాయికి రావడానికి కేసీఆర్ వల్లనే అయిందని అన్నారు.

సి ఎం కేసీఆర్ విశేష ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ  మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర అసంతృప్తి తో రగిలి పోయారని కెప్టెన్ తెలిపారు. ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారనీ, రైతు బంధు పథకాన్ని ఈటెల కు ప్రాధాన్యత ఇచ్చి హుజురాబాద్ నియోజకవర్గంలోనే కేసీఆర్ ప్రారంభించారనీ, ఐనప్పటికీ ఈ పథకాలపై వ్యతిరేక ధోరణితో ఈటల రాజేందర్ మాట్లాడారనీ అన్నారు.

హుజురాబాద్ లో కోట్ల విలువైన క్లబ్ స్థలాన్ని కూడా ఆక్రమించాలని చూసాడనీ, ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వాన్ని, పార్టీలో ఉంటూ సి ఎం కేసీఆర్ పై పార్టీ నాయకులపై విమర్శలు చేయడం అయన విజ్ఞతకే వదలివస్తున్నాం అని అన్నారు.

సి ఎం కేసీఆర్ కృషి తోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనీ, గోదావరి జలాలు తెలంగాణాలో పరవళ్లు తొక్కుతున్నాయనీ, ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయనీ అన్నారు.

సి ఎం కేసీఆర్  నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అసంతృప్తిలో ఉన్నారని ప్రచారం చేయడం దారుణంఅని, అలాంటిది దుష్ప్రచారమే తప్ప అందులో వాస్తవం లేదనీ అన్నారు.

ఎవరైనా పార్టీకి, క్రమశిక్షణను లోబడి పనిచేయాల్సిందే

నాయకులకు పార్టీనే ముఖ్యం అని, నాయకులు, కార్యకర్తలు ఎవరైనా పార్టీకి, క్రమశిక్షణను లోబడి పనిచేయాల్సిందే అని పార్టీ వల్లనే నేడు పదవులు వచ్చాయనీ, పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందనీ అన్నారు.

సి ఎం కేసీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడం వల్లనే నాగార్జున సాగర్ ఎన్నికల్లో, అలాగే ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం వరించిందనీ,  తెలంగాణకు దశ, దిశ చూపించేది టీఆరెస్ పార్టీ మాత్రమే అని, అభివృద్దే సి ఎం కేసీఆర్ ఎజెండా. ప్రతిపక్షాలకు రాజకీయాలే తప్ప ఎజెండా లేదనీ అన్నారు.

టీఆరెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదనీ, పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే అని ఆయన అన్నారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమమే జెఎస్ఎస్ ధ్యేయం

Satyam NEWS

జేఈఈ తొలివిడతలో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

Bhavani

వి.ఎస్.యూ లో ఘనంగా యువజనోత్సవాలు

Bhavani

Leave a Comment