33.7 C
Hyderabad
April 29, 2024 02: 35 AM
Slider మహబూబ్ నగర్

ఆన్లైన్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

#OnlineClasses

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం  అందిస్తున్న ఆన్లైన్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ నరేందర్ గౌడ్ కోరారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో విద్యార్థులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆన్లైన్ విద్యను అందించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అని ఆయన కోరారు. 

డి డి యాదగిరి ఛానల్ లో ఉదయం 8 గంటలనుండి 10:30 వరకు సైన్స్ విద్యార్థులకు మధ్యాహ్నం మూడు గంటల నుండి 6 గంటల వరకు ఆర్ట్స్ విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థులు యూట్యూబ్, టి-సాట్ యాప్ ద్వారా ఆన్లైన్ తరగతులను చూడవచ్చు.

సందేహాలుంటే టీచర్ కు ఫోన్ చేయవచ్చు

పాఠ్యాంశాలలో ఏమైనా   సందేహాలు ఉంటే సంబంధిత అధ్యాపకుని కి ఫోన్ చేసి  నివృత్తి చేసుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అడ్మిషన్స్ పొందాలని తెలిపారు.

 ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో అన్ని విధాలుగా నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉపకార వేతనాలు, ఆధునిక బోధనా సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో అడ్మిషన్ పొందాలంటే 9490401206, 9959954440 ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అధ్యాపక బృందానికి అవసరమైన సూచనలను చేశారు.

విద్యార్థులు క్రమంగా ఆన్లైన్ తరగతులను వీక్షించేలా చూసే బాధ్యత అధ్యాపకులదే అని తెలిపారు. అలాగే వారి సందేహాలను నివృత్తి చేసే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వినయ్ కుమార్, అధ్యాపకులు శ్రీనివాస రావు, దశరథ రాం, ప్రవీణ్ కుమార్, రాగమయి, మయూరి పాల్గొన్నారు.

Related posts

టిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డ మాజీ ఎంపీ  బూర నరసయ్య గౌడ్

Murali Krishna

వైఖానస ఆగమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గా రంగ భట్రాచార్యులు

Satyam NEWS

రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతున్నా స్పందించరా?

Bhavani

Leave a Comment