40.2 C
Hyderabad
April 29, 2024 18: 28 PM
Slider సంపాదకీయం

ఉలిక్కిపడుతున్న వైసీపీ నేతలు: నోరు మెదపని బీజేపీ నేతలు

#maguntasrinivasareddy

ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరెస్టు అయినా ఆ విషయంపై ఏపిలోని అధికార పార్టీ ఏ వ్యాఖ్యా చేయలేదు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు, వైసీపీ నాయకుడు రాఘవరెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ అరెస్టుకు సంబంధించి వైసీపీ నాయకులే కాదు బీజేపీ నాయకులు కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

తొలి నుంచి ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి బీజేపీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను టార్గెట్ చేస్తూ మాట్లాడారు తప్ప ఆ కుంభకోణంతో సంబంధం ఉన్న వైసీపీ నేతల గురించి మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీపై పోరాటం చేస్తున్నామని చెప్పుకునే బీజేపీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ నాయకులు ఉన్నా కూడా చూసీ చూడనట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నదో అర్ధం కావడం లేదు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నాయకుడు అరెస్టు కావడం ఒక రకంగా ఆ పార్టీ నాయకుల్లో భయం పుట్టిస్తున్నది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు వినిపించగానే ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తమ కుటుంబం దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నదని, తమకు కుంభకోణాలు చేసే అలవాటు లేదని స్పష్టం చేశారు. ఆయన ఆనాడు చెప్పిన మాటలు చాలా మంది విశ్వసించారు.

బీజేపీ కావాలని ఇదంతా చేస్తున్నదేమో అని అనుకున్నారు. సీబీఐ కూడా పొరబాటుపడి ఉంటుందని భావించారు. అయితే తాజాగా సీబీఐ పక్కా ఆధారాలతో మాగుంట రాఘవరెడ్డిని అరెస్టు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్ లో ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ పూర్తి వివరాలు పొందుపరిచింది. శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి, ఎమ్మెల్సీ కవిత, అరబిందో శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతల తరపున విజయ్ నాయర్ స్వీకరించారని చార్జిషీట్ లో పేర్కొన్నది.

సౌత్ ఇండియా గ్రూప్ భాగస్వాములు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపారు. సాక్ష్యాధారాలతో సహా కేసు దాఖలు కావడంతో ఒక్క సారిగా వైసీపీ ఉలిక్కిపడింది. మచ్చలేని కుటుంబం అనుకున్న మాగుంట ఫ్యామిలీకి చెందిన వారసుడు మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం రాబోయే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. వైసీపీకి జరుగుతున్న నష్టాన్ని ఎలా భర్తీ చేయాలా అని వైసీపీ అనుకూల బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు.  

Related posts

విజయనగరం దిశ మహిళా పోలీస్ స్టేష‌న్ ఆక‌స్మిక త‌నిఖీ

Satyam NEWS

గురుకుల పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ

Satyam NEWS

రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తి సీఎంగా అనర్హుడు

Satyam NEWS

Leave a Comment