38.2 C
Hyderabad
April 27, 2024 16: 46 PM
Slider వరంగల్

కరోనా వస్తే కంగారు పడకుండా వైద్యం చేయించుకోండి

#CoronaTest

ములుగు జిల్లా బండార్పల్లిలో స్థానికులకు నేడు కరోనా టెస్టులు నిర్వహించారు. మొత్తం 39 మందికి కరోనా పరీక్షలు చెయ్యగా అందులో ముగ్గురికి కరోనా ఉన్నట్టు నిర్దారించారు.

ములుగు జిల్లా TB,AIDS, Leprosy ప్రొగ్రాం ఆఫిసర్ డాక్టర్ పోరిక రవీందర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ రవీందర్ తెలిపారు.

ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, వ్యక్తిగత దూరం తప్పని సరి అని ఆయన అన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని, కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

తగిన సమయంలో సరైన మందులు వాడితే సరిపొతుందన్నారు. ఎవరికైనా విపరీతమైన జ్వరం, ధగ్గు, ఆయాసం ఉంటే తక్షణమే వైద్యుని సంప్రదించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి డాక్టర్ జోష్న, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Related posts

ఏపి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం

Satyam NEWS

రైతు సంక్షేమంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

విశాఖపట్నం వైసీసీ మొత్తం ఖాళీ

Satyam NEWS

Leave a Comment