28.7 C
Hyderabad
April 27, 2024 05: 40 AM
Slider ముఖ్యంశాలు

కృష్ణానది నిండుకుండలా మారడంతో సంతోషం వ్యక్తం చేసిన మాజీమంత్రి

#jupally

సోమశిల కృష్ణా నది నిండుకుండలా మారింది అంటే చాలు దూర ప్రాంతాల నుండి పర్యాటకులు సోమశిల కు వస్తారు. నేడు సోమశిల పర్యాటక కేంద్రంగా మారింది అంటే దానికి కారణం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన మంత్రి గా వున్న సమయంలో  కాటేజ్ నిర్మాణాలు చేపట్టి సోమశిలను పర్యాటక కేంద్రంగా మార్చారు.

సోమశిలను టూరిజం ప్రాంతంగా చేశారు. సోమశిలకు పర్యాటకులు ఎంతో దూరం నుండి వచ్చి సోమశిల అందాలను తిలకిస్తున్నారు. ముఖ్యంగా కొల్లాపూర్ మండలం ఏల్లూరు గ్రామ సమీపంలో వున్న కే ఎల్ ఐ ప్రాజెక్టు  వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.

కృష్ణానది నిండుగా వుంటే కొల్లాపూర్ ప్రాంత రైతులు ముఖంలో ఎప్పుడు సంతోషాలే. ఇదంతా జూపల్లి కృష్ణారావు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన గొప్ప కార్యక్రమాలు. అందుకే సోమశిల కృష్ణా నది నిండితే అందరికీ సంతోషాలే. అందుకే ప్రతి ఏడాది  సోమశిల కృష్ణానది  నిండడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గంగమ్మకు  స్వాగతం పలుకుతారు.

ఈ ఏడాది కూడా  సోమశిల కృష్ణా నది నిండు కుండలా  మారడంతో శుక్రవారం మాజీ మంత్రి జూపల్లి అనుచరులతో కలిసి కొల్లాపూర్ నుండి  ద్విచక్రవాహనం  నడుపుతూ సోమశిలకు వెళ్లారు. కృష్ణా నదిలో పూలు చల్లి కొబ్బరికాయ కొట్టి గంగమ్మకు స్వాగతం పలికారు. కృష్ణా నదిలో  ఈతకొట్టి స్నానాలు చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం అక్కడే ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. జయశంకర్  ఆశయాలను కొనసాగించాలని జూపల్లి పిలుపునిచ్చారు.వారి తోపాటు  సోమశిల గ్రామ సర్పంచ్ మద్దిలేటి, సింగల్ విండో డైరెక్టర్ నరసింహ, కౌన్సిలర్ షేక్ రహీం పాష, ఎగ్బాల్, కల్వరాల నరసింహ, ధర్మ తేజ,పసుల వెంకటేష్, దిలీప్, కృష్ణయ్య గౌడ్, మాజీ సర్పంచ్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

వివేకా మర్డర్ కేసు: దిగజారి పోయిన పార్టీ పరువు

Satyam NEWS

హోమ్ గార్డులకు నివేశన స్థలాలు ఇచ్చిన ఎమ్మెల్యే

Satyam NEWS

షోకేసు:అసెంబ్లీకి మిడతలను తెచ్చి కంట్రోల్ చేస్తేనే ఓటు

Satyam NEWS

Leave a Comment