28.7 C
Hyderabad
April 26, 2024 08: 45 AM
Slider ఆంధ్రప్రదేశ్

నంద్యాల ఘటనను సుప్రీం సుమోటోగా స్వీకరించాలి: సోమిరెడ్డి

Nandyal insident

పోలీసుల కిరాతకం కారణంగానే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం బలైపోయింది.. ఒక భారత పౌరుడి కుటుంబానికి పోలీసుల తీరుతో ఇలాంటి పరిస్థితి రావడం మనస్సును కలిచివేస్తోంది.. 70 వేలు పోయాయని ఎవరో కేసు పెడితే రుజువు కాకుండానే ఇంతలా వేధిస్తారా.. సలాం దంపతులు తమ బిడ్డల కాళ్లు, చేతులు కట్టేసి రైలు పట్టాలపై మెడలు పెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పోలీసులు తేవడం దారుణం..ఇంతకన్నా ఘోరముంటుందా..

పోలీసుల‌ది మితిమీరిన వ్య‌వ‌హారం..

ఈ భారతదేశంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా.. మొన్నేమో రాజమండ్రిలో పదేళ్ల పసిబిడ్డపై అత్యాచారం ఘటనలో పోలీసులే కేసు ఉపసంహరించుకోమని ఒత్తిడి తెస్తారు..చివరకు కుటుంబపెద్ద ఆత్మహత్యాయత్నం చేసుకున్న పరిస్థితి.. ఏపీలో కొందరు పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారు..

వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా ఎమ్మెల్యేల చేతుల్లోకి..

ఎమ్మెల్యేలను కాదని తాము ఏమి చేయలేకపోతున్నామనే స్థితికి కలెక్టర్లు, ఎస్పీలు వచ్చేశారు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు పూర్తిగా ఎమ్మెల్యేల చేతుల్లో చేరి నిర్వీర్యమయ్యాయి.. కలెక్టర్, ఎస్పీలు నిస్సహాయులుగా మిగిలిపోయారు.. పోలీసుల వేధింపులకు భయపడొద్దని హోం మంత్రి సెలవిస్తున్నారు..అంతేకానీ వేధింపులు ఆపుతామని మాత్రం చెప్పలేకపోతున్నారు..

రైతుల‌కు బెయిల్‌రాదు.. పోలీసుల‌కు బెయిలా?

ఇంతటి దారుణాలు జరుగుతున్నా పోలీసులపై చర్యలు తీసుకునేందుకు హోం మంత్రి ధైర్యం చేయలేకపోతున్నారు.. అమరావతిలో నిరసన తెలిపిన రైతులకేమో 13 రోజులయినా బెయిల్ రాదు..సలాం కుటుంబం ఇంత ఘోరంగా ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన పోలీసులకు మాత్రం 12 గంటల్లో బెయిల్..

సీఐ, హెడ్ కానిస్టేబుళ్లను మాత్రమే కాదు..ఎస్పీ, డీఎస్పీలను కూడా సస్పెండ్ చేయాలి.. మీ పోలీసులపై విచారణ మీ పోలీసులతోనా..సీబీఐ ఎంక్వయిరీ చేయాల్సిందే.. సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాల్సిన కేసు ఇది..

Related posts

పెద్దదడిగి లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Satyam NEWS

తిరుమలలో 12న గోకులాష్టమి ఆస్థానం, 13న ఉట్లోత్సవం

Satyam NEWS

రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment