40.2 C
Hyderabad
April 28, 2024 17: 19 PM
Slider ఖమ్మం

తాసిల్దార్ కార్యాలయంలో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

#chintakanimandal

ఆర్ధిక సంస్కరణలు, రెవెన్యూ సంస్కరణలు అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతారు కానీ పేదవాడి భూమికి మాత్రం భద్రత కల్పించలేకపోతున్నారు.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం లో ఒక పేదవాడి భూమిని వేరే పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. దాంతో ఆ వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేశాడు.

తన భూమిని  వేరే వాళ్ల పేరు మీద  రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్  చేశారని,  ఆరు నెలల నుంచి  ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కానీ తనకు న్యాయం చేయకుండా  సుంకరి లక్ష్మి అనే  మహిళ పేరు మీద  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని  భూమి కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ చింతకాని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ చాంబర్లో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు 

వందనం గ్రామానికి చెందిన ఎల్లవుల కృష్ణ అనే రైతు. కృష్ణ తో బాటు అతని కుటుంబ సభ్యులు కూడా అధికారుల కాళ్లపై పడి వేడుకోవడం హృదయాన్ని కదిలించివేస్తున్నది.

Related posts

మిద్దె కూలి మరణించిన సర్పంచ్ ఆమె మనుమడు

Satyam NEWS

నీలోఫర్ లో చికిత్స పొందుతూ కరోనాతో బాలుడు మృతి

Satyam NEWS

ఇకపై నా జీవితం ఈ “డైరెక్షన్”లో మాత్రమే!!

Satyam NEWS

Leave a Comment