38.2 C
Hyderabad
April 28, 2024 19: 21 PM
Slider నల్గొండ

రైతుల కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

#CPIHujurnagar

రాష్ట్రంలో రైతుల కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని CPI పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు ,జిల్లా మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దేవరం మల్లీశ్వరి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఆదివారం వర్షానికి తడిచిన ధాన్యపు నిల్వలను, పడిపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ నివార్ తుఫాన్ వలన గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ,రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

పంట నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్ట పరిహారాన్ని చెల్లించాలని,సన్న రకం ధాన్యం కొనుగోలు కాక రైతులు అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 2500 రూపాయలు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపి  రైతు చట్టాలలో మద్దతు ధర అంశాన్ని చేర్చాలని అన్నారు.ఢిల్లీలో రైతులపై జరిగిన లాఠీచార్జీని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం పట్టణ అధ్యక్షుడు జక్కుల రమేష్ ,పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు దేవరం సుజాత,దేవరం రవీందర్ రెడ్డి ,చెన్న గాని సైదులు,  పశ్య మల్లీశ్వరి,పశ్య వెంకటరెడ్డి,దేవరం వెంకటరెడ్డి,దేవర పద్మ, రైతులు పాల్గొన్నారు.

Related posts

పదోన్నతి ద్వారా బాధ్యత మరింత పెరుగుతుంది

Satyam NEWS

మందు అమ్ముతారు కానీ మేం వ్యాపారం చేసుకోకూడదా?

Satyam NEWS

అక్సిడెంట్:ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Satyam NEWS

Leave a Comment