33.7 C
Hyderabad
April 27, 2024 23: 39 PM
Slider ఆదిలాబాద్

కాల్పుల్లో గాయపడ్డ సయ్యద్ జమీర్ అంత్యక్రియలు

#AdilabadPolice

ఆదిలాబాద్​ పట్టణంలోని తాటిగూడకాలనీ సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో గాయపడ్డ  సయ్యద్​ జమీర్​ అనే వ్యక్తి  మృతి చెందాడు.  ఈ నెల 18వ తేదీన  ఇరు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో  ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు,  మున్సిపాల్ మాజీ వైస్​ చైర్మన్​  ఫారుక్​ అహ్మద్​ జరిపిన కాల్పుల్లో సయ్యద్​ జమీర్​ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. 

వెంటనే ఆయన్ను స్థానిక రిమ్స్​కు తరలించగా అక్కడి డాక్టర్ల సూచన మేరకు   హైదరాబాద్​ నిమ్స్​ హస్పిటల్​కు అదే రోజు రాత్రి తరలించారు.  అక్కడ తొమ్మిది రోజులుగా  ట్రీట్​మెంట్  పొందిన జమీర్​ శరీరం నుంచి డాక్టర్లు బుల్లెట్లు తొలగించడంతో పరిస్థితి విషమించి శుక్రవారం అర్దరాత్రి ఆయన  మృతి చెందాడు. 

ఈ దాడిలో  ముగ్గురు వ్యక్తులు గాయపడగా  ప్రస్తుతం ఒకరు నిమ్స్​లో మరొకరు,  మరోకరు స్థానిక రిమ్స్​లో ట్రీట్​మెంట్​ పొందుతున్నారు.  కాగా ఈ దాడికి పాల్పడిన ఫారుక్​ అహ్మద్​ ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్​ ఖైదీగా ఉన్నాడు. 

పకడ్బందీ పోలీస్​ బందోబస్తు

సమాచారమందిన వెంటనే  అప్రమత్తమైన జిల్లా పోలీస్​యంత్రాంగం కాలనీలో పకడ్బందీ బందోబస్తు ను ఏర్పాటు చేసింది.  శాంతిభద్రతలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా 300మంది పోలీసులతో కాలనీలో ప్రత్యేక పోలీస్​ ఫికెటింగ్ ను  ఏర్పాటు చేయడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 

పోస్టుమార్టం అనంతరం  సాయంత్రం ఆరు గంటలకు  మృతుడి డెడ్​బాడీ జిల్లా కేంద్రానికి చేరుకోగా  జిల్లా ఇంచార్జీ ఎస్పీ ,  రామగుండం సీపీ సత్యనారాయణ  ఆధ్వర్యంలో పోలీస్​ భద్రత నడుమ డెడ్​బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  అంత్యక్రియలు జరిగే వరకు కాలనీలోనే ఉన్న సీపీ ఘటనకు సంబంధించిన కుటుంబ సభ్యులను వివరాలడిగి తెలుసుకున్నారు.  అనంతరం భారీ బందోబస్తు నడుమ జమీర్​ అంత్యక్రియలను నిర్వహించారు.  సీపీతో పాటు జిల్లా ఓఎస్డీ  ఎం.రాజేష్​ చంద్ర,  ఆదిలాబాద్​, మంచిర్యాల డిఎస్పీలు  వెంకటేశ్వర్​రావు,  ఉదయ్​ కుమార్​ రెడ్డిలు  అంత్యక్రియలు ముగిసేవరకు దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షించారు.

Related posts

భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Satyam NEWS

తీహార్‌ జైల్లో నిర్భయ కేసు దోషులకు మాక్‌ ఉరి

Satyam NEWS

4 లక్షల రూపాయలతో 3వ వార్డులో డ్రైనేజీ ప్రారంభోత్సవం

Satyam NEWS

Leave a Comment