30.7 C
Hyderabad
April 29, 2024 06: 05 AM
Slider ప్రత్యేకం

రిజర్వేషన్లు, విద్యార్హతలు, సిలబస్ పై దృష్టి

focus on reservations, qualifications, syllabus

 రాష్ట్రంలో ఉద్యగాల  భర్తీకి ప్రభుత్వ విభాగాలు సన్నద్దమవుతున్నాయి. ప్రబ్బుత్వమ్  ప్రకటించిన 80వేలకు పైగా ఉద్యోగాల్లో భాగంగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా రోస్టర్ ప్రాతిపదికన రిజర్వేషన్లు, పోస్టుల వారీగా విద్యార్హతలు, వయసు, ఉద్యోగ పరీక్షల విధానం, ప్రభుత్వ నిబంధనలు, సిలబస్ తదితర అంశా లపై ప్రభుత్వ శాఖలు కసరత్తు ప్రారంభించాయి. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ, పోలీసు, వైద్య నియా మక బోర్డుల అధికారులతో ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రతిపాద నలు ఏ విధంగా ఉండాలి, న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు తదితర విష యాలపై నియామక సంస్థలు అధికారులకు పలు సూచనలు చేశాయి.

ఆర్థికశాఖ అనుమతి ఉత్తర్వులకు ముందుగా రోస్టర్ తదితర విషయాలపై సాధారణ పరిపాలన విభాగం స్పష్టత ఇచ్చింది. ఉద్యోగ ప్రకటన జారీకి ముందుగా ఆర్థికశాఖ అనుమతులు కీలకం. ఆ తరువాత సంబంధిత విభాగాలు రిజర్వేషన్లు, విద్యార్హతలు, సిలబస్, పరీక్ష విధానంపై ప్రతిపాదనలు రూపొందించి నియామక సంస్థలకు అందిస్తాయి. ఇవి సరిగా ఉన్నాయని నియామక సంస్థలు నిర్ధారించుకున్న తరువాత నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమ వుతాయి. ఇప్పటికే అనుమతి పొందిన పోస్టుల్లో పోలీసు నియామక సంస్థ పరిధిలో అత్యధికంగా 16,804 పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుంది.

ఈ నేపథ్యంలో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు అర్హ తలు, రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ తదితర అంశా లపై హోంశాఖ సమాయత్తమవుతోంది. ప్రతిపా దనలు పంపించాల్సిన విధానంపై బోర్డు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య విభా గంలో 10,028 పోస్టుల నోటిఫికేషన్ల జారీకి ప్రాథ మిక ప్రక్రియ మొదలైంది. టీఎస్ పీఎస్సీ పరిధిలో గ్రూప్-1కింద 503 పోస్టులతో కలిపి మొత్తం 3,576 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 కింద ప్రభుత్వ విభాగాలు అందించాల్సిన ప్రతిపాదనలపై అధికా రులకు అవగాహన కల్పించింది. రిజర్వేషన్లు, పోస్టుల వారీగా అర్హతలు తదితర అంశాలను చర్చించింది.

ప్రభుత్వ విభాగాలు వారం నుంచి పది రోజుల్లోగా రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు, విద్యార్హతలు, పరీక్ష విధానం, సిలబస్ తదితర అంశాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసేం దుకు సమాయత్తమవుతున్నాయి

Related posts

జులై 3న దేశవ్యాప్త నిరసనలను జయప్రదం చేయండి

Satyam NEWS

ఆత్మరక్షణ కొరకు మాకు ఆయుధాలు ఇవ్వండి

Satyam NEWS

రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన విదేశాంగ మంత్రి

Satyam NEWS

Leave a Comment