32.7 C
Hyderabad
April 26, 2024 23: 57 PM
Slider ఆదిలాబాద్

తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు మాస్కులు

parvathii rajesh

మంచిర్యాల జిల్లా కేంద్రం లో పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సంపత్ కుమార్ సమక్షంలో   తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు, పౌరసంబందాల శాఖ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, కోడిగుడ్లు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సంపత్ కుమార్, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పార్వతి రాజేష్ కుమార్ మాట్లాడుతూ పోలీసులు జర్నలిస్టులు,  డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులతో పాటు ప్రజలను అన్ని విషయాల్లో చైతన్య పరుస్తున్న కళాకారులకు కరోనా వైరస్ సోక కుండా ఉంచేందుకు ఈ ప్రయత్నం చేసినట్లు చెప్పారు.

 వారు ఆరోగ్యంగా ఉండి ప్రజలను పాటల రూపంలో చైతన్య పరచాలని కోరారు. ప్రభుత్వం కళాకారులను ఎమర్జెన్సీ వీధుల కింద పరిగణించి వారికి  నిత్యావసర వస్తువుల తో పాటు  జీతం లో కొంత ఎక్కువ శాతం అందించాలని అన్నారు. 

అలాగే కళాకారులు ఆరోగ్యం గా వుండాలని తమరిని తాము కాపాడుకొని శక్తివంతంగా వుండాలని ఇమ్మ్యూనిటి పవర్, విటమిన్ పెంపుదలకు కోడిగుడ్లు, పండ్లు, చికెన్  తినాలని అన్నారు. అనంతరం కళాకారులకు మాస్కులు ,శానిటైజర్లు, గుడ్లు, పండ్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చొక్కారపు శ్రీనివాస్, కో కన్వీనర్ కొండబత్తుల సతీష్ నేత, మహేష్, పార్వతి సురేష్, శంకర్, ఆనంద్, సందీప్, శేఖర్, సత్యం  పాల్గొన్నారు.

Related posts

సంక్షేమo, అభివృద్ధి రెండు కళ్ళు

Satyam NEWS

కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదు

Bhavani

నిరసన తెలిపే వారిని తుపాకితో బెదిరిస్తారా?

Satyam NEWS

Leave a Comment