37.2 C
Hyderabad
May 2, 2024 11: 17 AM
Slider పశ్చిమగోదావరి

పెదవేగి నవోదయ విద్యాలయం లో  ఫుడ్ పాయిజన్

#pedavegi

ఏలూరు జిల్లా పెదవేగి నవోదయ విద్యాలయం లో  ఫుడ్ పాయిజన్ జరిగి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న దెందులూరు శాసన సభ్యులు, పెదవేగి తహసీల్దార్ మరియు మండల మేజిస్ట్రేట్ నల్లమెల్లి నాగరాజు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు హుటాహుటిన పెదవేగి నవోదయ విద్యాలయ కు చేరుకున్నారు. ఈ నెల 3వ తేదీన  ఈ పాఠశాలలో అంతర్రాష్ట్ర నవోదయ విద్యాలయాల విద్యార్థులకు జరిగే క్రీడల పోటీలలో పాల్గొనేందుకు కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి పెదవేగి నవోదయ పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యం క్రీడాకారులకు గురువారం రాత్రి చికెన్ కర్రీతో భోజనం శుక్రవారం ఉదయం వెజ్ బిర్యానీ పెట్టారు. ఈ రెండు  ఆహార పదార్థాలలో ఎక్కడ తేడా జరిగిందో మరి ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అస్వస్థత పాలవడం తో వారి ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తహసీల్దార్ ఎన్ నాగరాజు శుక్రవారం రాత్రి తెలిపారు.

Related posts

మరో సారి సత్తా చాటిన నల్లగొండ  జిల్లా పోలీసులు

Satyam NEWS

ప్రధాని దిష్టి బొమ్మ దగ్ధం చేయడం వెకిలి రాజకీయాలకు నిదర్శనం

Satyam NEWS

కన్నడ భక్తులతో నిండిన శ్రీశైల మహాక్షేత్రం

Satyam NEWS

Leave a Comment