28.7 C
Hyderabad
April 27, 2024 04: 38 AM
Slider మహబూబ్ నగర్

నాయి బ్రాహ్మణులు, రజకులు ఉచిత విద్యుత్ సద్వినియోగం చేసుకోవాలి

#sharman ias

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ నాయిబ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటి వరకు 467  మంది దరఖాస్తు చేసుకోగా 152 దరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 315 దరఖాస్తులు నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీల నుండి స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ పథకానికి లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి జిల్లా  బీసీ సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ఇంకా నమోదు చేసుకుని   లబ్ధిదారులు తమ ధరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఈడీ ఎం ను కలెక్టర్ ఆదేశించారు. సిజిజి లో రిజిష్ట్రరు చేసుకున్న ధరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే రాష్ట్రస్థాయి డిస్కామ్ లకు పంపించి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం జివో. ఎంస్. నెం. 2, తేది 04-04-2021  ప్రభుత్వం, బీసీ వెల్పేర్ (డి) డిపార్ట్ మెంట్ ద్వారా జారీ చేయడంతో పాటు నియమనిబంధనలు కూడ విడుదల చేసిందనన్నారు. ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఈడియం నరేష్, తదితరులు పాల్గొన్నారు.

ఔట రాజశేఖర్, సత్యం న్యూస్, కొల్లాపూర్

Related posts

టి 24 టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ

Bhavani

విలీనం అవసరం లేదు చర్చలకు పిలవండి

Satyam NEWS

ముందు చూపులేని తనం తో ప్రజల్ని అంధకారం లో నెట్టారు

Satyam NEWS

Leave a Comment