39.2 C
Hyderabad
April 28, 2024 11: 15 AM
Slider ఖమ్మం

విప్లవోద్యమ వేగుచుక్క గద్దర్

#K. Rannarayana

తుదిశ్వాస వరకు ప్రజా ఉద్యమాలలో పని చేసి సామాజిక చైతన్యానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన గళాన్ని, కలాన్ని సంధించిన ప్రజా ఉద్యమ వేగుచుక్క గద్దర్ అని టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ తెలిపారు. ప్రజా ఉద్యమాలు జరిగినంత కాలం ప్రశ్నించే గొంతుక ఉన్నంత కాలం నిత్యం గద్దర్ స్మరించబడతారని ఆయన తెలిపారు. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సంస్మరణ సభ టియుడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లోలో జరిగింది. ఐజెయు నగర అధ్యక్షులు పాపారావు అధ్యక్షతన జరిగిన సభలో రాంనారాయణ మాట్లాడుతూ యుక్త వయస్సులోనే తొలి దశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాల్గొన్నారని జైలు జీవితాన్ని సైతం అనుభవించారన్నారు.

ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన ఉద్యోగాన్ని వదులుకుని సాయుధ పోరాట బాట పట్టారని విప్లవోద్యమంలో అనేక కష్ట, నష్టాలను ఎదుర్కొన్నారని రాంనారాయణ తెలిపారు. గద్దర్ పాటలు తూటాల్లా పేలేవని ప్రజల్లో చైతన్యం రగిలిస్తే పాలకుల్లో ఆందోళనలు కలిగించాయని రాంనారాయణ తెలిపారు. గద్దర్ పాట నిత్యం చైతన్య స్ఫూర్తి అని అట్టడుగు వర్గాల ప్రజా జీవితాన్ని తన పాటలతో, తన మాటలతో కళ్లకు కట్టినట్లు చూపించిన మహానీయుడన్నారు.

గద్దర్ చరిత్ర ఈ తరాలకే కాదు భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తి నిచ్చేవిధంగా పాఠ్యాంశాలలో చేర్చాలని, గద్దర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును తన పాటలతో చూపించిన గద్దర్ అమరుడని ప్రజాపాట బతికి ఉన్నంత కాలం గద్దర్ ప్రజల గొంతుల్లో పాటై వినిపిస్తాడని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో సమాచార వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని కానీ ఈ మార్పులు రాక ముందే పాలకుల వైఫల్యాలను, ప్రజల ఇబ్బందులను తన ఆట, పాట ద్వారా మారుమూల పల్లెలకు సైతం చేరవేసిన అతిగొప్ప జర్నలిస్టు గద్దర్ అని ఆయన తెలిపారు.

సభకు ముందు గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్దర్ మృతికి సంతాప సూచికగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి కూరాకుల గోపి ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించగా టియుడబ్ల్యూజె (ఐజెయు) ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వర రావు, మాటేటి వేణుగోపాల్, సర్వనేని వెంకట్రావు, ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నలజాల వెంకట్రావు, ఎస్క మోహినుద్దీన్,

వై.మాధవరావు, నామ పురుషోత్తం, కె. వెంకటేశ్వర్లు, సంతోష్, భరత్ తదితరులు ప్రసంగించగా ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సామినేని కృష్ణ మురారి, గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, వివిధ పత్రికలు ఛానెళ్ల బాధ్యులు సత్యనారాయణ, నాగేశ్వరరావు, ఏలూరి వేణుగోపాల్, బసవేశ్వరరావు, గడల నర్సింహారావు, మేడి రమేష్, కళ్యాణచక్రవర్తి, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆర్అండ్ నుంచి ప్రెస్క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

Related posts

సైబరాబాద్ పరిధిలో ఎస్ఐల బదిలీలు

Bhavani

రెండో దశ ఇళ్లను అతి త్వరలో ఇస్తున్నాం

Satyam NEWS

కొన్న భూములు కాపాడుకోవటం కోసం…

Satyam NEWS

Leave a Comment