30.7 C
Hyderabad
April 29, 2024 03: 10 AM
Slider మహబూబ్ నగర్

మొక్కలు నాటి భావి తరాల వారికి స్వచ్ఛమైన గాలి అందిద్దాం

#Gadwal Police

హరితహారం కార్యక్రమాన్ని  పురస్కరించుకోని మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా  గట్టు పోలీస్ స్టేషన్ అవరణo లో  జిల్లా ఎస్పీ  జె.రంజన్ రతన్ కుమార్ మొక్కలను నాటారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భావితరాల వారికి స్వచ్చమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు  మొక్కలను నాటడం తమ వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం వుందని అన్నారు.

ప్రతి ఒక్కరు  పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజూన మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా  అందజేయడం ఆనవాయితీగా మార్చుకోవాలని ఆయన కోరారు. పోలీస్ స్టేషన్ల పరిసరాలను ఆహ్లాదకరంగా ఉండేందుకు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో  మొక్కలను నాటుతున్నామని ఆయన తెలిపారు.

ప్రాణాధారమైన మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా సకాలంలో రుతుపవనాలు రావడమే కాకుండా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. హరితహారం లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ద్వారా భావితరాలకు కాలుష్య రహిత మైన వాతావరణం అందించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె. కృష్ణ, ఎస్సై మంజునాథ్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరోనా సాకుతో దోచుకున్నోడికి దోచుకున్నంత

Satyam NEWS

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

Satyam NEWS

జిన్నాపై సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు

Sub Editor

Leave a Comment