40.2 C
Hyderabad
April 29, 2024 17: 03 PM
Slider ముఖ్యంశాలు

ఘరానా మోసం

#theft

ఐటీ అధికారుల పేరు చెప్పి గుంటూరులో ఘరానా మోసానికి పాల్పడ్డారు నిందితులు. బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని పాత గుంటూరు ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్న యర్రంశెట్టి కల్యాణి ఇంటికి కారులో  ముగ్గురు వ్యక్తులు వచ్చారు. తాము ఐటీ అధికారులమని చెప్పి ఇంట్లోకి వచ్చి సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను చెల్లించకుండా భారీగా బకాయి ఉన్నారంటూ ఆస్తిపత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. గుర్తింపు కార్డులు చూపించాలని కల్యాణి నిలదీయడంతో ఆమెను తుపాకీతో బెదిరించి డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు తీసుకుని ముగ్గురు వ్యక్తులు కారులో పరారయ్యారు. వెంటనే బాధితురాలు పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఏలూరు లో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ కలయిక..!

Satyam NEWS

మోడీ, సోనియాల సొంత రాష్ట్రాల్లో ఉచిత కరెంటు లేదు

Satyam NEWS

అన్న క్యాంటిన్ల మూసివేతపై తీవ్ర నిరసనలు

Satyam NEWS

Leave a Comment