38.2 C
Hyderabad
April 28, 2024 23: 00 PM
Slider గుంటూరు

జీవో వన్ సస్పెండ్ చేయడం శుభ పరిణామం

#potulabalakotaiah

రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామిక హక్కులను, పౌరహక్కులను కాలరాసే చీకటి జివో నెంబర్ వన్ ను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేయటం శుభ పరిణామమని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. ఈ మేరకు గురువారం నాడు ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జివోకి వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేసిన సిపిఐ నాయకులు రామకృష్ణ కు అభినందనలు తెలిపారు.

ప్రతి పక్షాలను టార్గెట్ చేసి తెచ్చిన ఈ జివో అంతిమంగా ప్రజల హక్కులనే హరిస్తోంది. రాష్ట్ర వ్యాపితంగా పౌర సంఘాలు, ప్రజాసంఘాలు, ఉద్యగ సంఘాలు, దళిత బహుజన సంఘాల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్వచ్చందంగా జివో ను ఉపసంహరించుకోవాలి. కౌంటర్ దాఖలు చేసే ప్రయత్నం చేయకూడదు. న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేసినా నవ్విపోతే గాక నాకేటి సిగ్గు’అనే ధోరణి ప్రభుత్వం మానుకోవాలి అని ఆయన హితవు చెప్పారు.

Related posts

లాక్ డౌన్: నిరుపేదలెవరూ ఆకలితో అలమటించవద్దు

Satyam NEWS

తెలంగాణ లో బదిలీల జీవోపై హైకోర్టు స్టే

Sub Editor 2

4 రోజుల్లో పోడు పట్టాల పంపిణీ పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment