29.7 C
Hyderabad
April 29, 2024 10: 59 AM
Slider ఆధ్యాత్మికం

ములుగు శ్రీ క్షేత్రం లో ఘనంగా ‘శ్రీ గోదాదేవి కళ్యాణం

#goda kalyanam

శ్రీ గోదాదేవి జయంతి సందర్బంగా ములుగు జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం (శ్రీ క్షేత్రం) లో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ గోదాదేవి జయంతిని ప్రధాన అర్చకులు పొడిచేటి శేషాచార్యులు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం లో వచ్చే శ్రీ గోదాదేవి జయంతి చాలా విశిష్టమైందని, సకల ప్రజలకు సుఖ, సంతోషాలను, భాగ్యాలను అమ్మవారు కలుగజేస్తారని ఆయన తెలిపారు.

గోదాదేవిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. తమిళనాడు లో గోదాదేవి జయంతి ని ‘ఆదిపూరం’ పేరుతో పెద్ద పండుగలా నిర్వహిస్తారని, ‘పూరం’ అనేది పూర్వా ఫల్గుణి నక్షత్రాన్ని సూచిస్తుందని, ఆది పూరం పండుగని వైష్ణవ మరియు శక్తి ఆలయాలలో ఉత్సవంగా జరుపుతారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గండ్రకోట కుమార్, కొత్తపల్లి బాబూరావు, సలుపాల శీను, గంధం విజేందర్, ఎల్కతుర్తి రాజన్న, భక్తులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.

13వ తేదీన మొదటి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని, కోవిద్ నిబంధనలు పాటిస్తూ, సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉంటాయని ఆలయ కమిటీ తెలిపింది.

Related posts

సీఎం కేసీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయం బండి

Sub Editor

హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు

Satyam NEWS

16 నెలలు జైల్లో ఉండే దొంగ రాష్ట్ర సీఎం.. ఇదీ మన ఖర్మ

Satyam NEWS

Leave a Comment