40.2 C
Hyderabad
April 29, 2024 17: 35 PM
Slider గుంటూరు

పల్నాడు ప్రాంత అభివృద్ధికి కీలక ముందడుగు

#narasaraopetmla

పల్నాడు ప్రాంత అభివృద్ధికి కీలక ముందడుగు పడిందని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటన ను పురస్కరించుకొని ఈరోజు నరసరావుపేట పట్టణంలోని టౌన్ హాల్ నందు వివిధ రాజకీయ పార్టీ నాయకులు విద్యా సంస్థల ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి NEC కాలేజ్ చైర్మన్ మిట్టపల్లి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో లో జిల్లాలో మౌలిక వసతుల కల్పన అవసరమైన సౌకర్యాల ఏర్పాటు గురించి సమావేశానికి హాజరైన పెద్దలు చర్చించారు. ముఖ్యంగా నరసరావుపేట పట్టణమందు ట్రాఫిక్ సమస్య, రోడ్ల విస్తీర్ణ, మెడికల్ కాలేజీ ఏర్పాటు, నరసరావుపేట నుండి నకరికల్లు ట్రైన్ ట్రాక్ కనెక్టువిటీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు, నరసరావుపేట చిలకలూరిపేట రోడ్డు నాలుగు నెలలుగా విస్తరించుట, ప్రైవేట్ వెటర్నరీ కాలేజీ ఏర్పాటు, కోటప్పకొండ గిరి ప్రదక్షిణ రోడ్డు అభివృద్ధి, పట్టణ సుందరీకరణ, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు, ఆటోనగర్ ఏర్పాటు, టెంపుల్ సిటీ గా అభివృద్ధి చెయ్యటం, మాస్టర్ ప్లాన్ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు, తదితర అంశాల గురించి హాజరైన పెద్దలు చర్చించారు.

ఇవన్నీ సాధించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సభలో వక్తలు  మాట్లాడుతూ నరసరావుపేట జిల్లా ఏర్పాటు కోసం ఎమ్మెల్యే చేసిన కృషిని సభకు వివరించి కొనియాడారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట నియోజకవర్గం ఇన్ ఛార్జి అలెగ్జాండర్ సుధాకర్,  బిజెపి నాయకులు బాబావలె, ఎం ఐ ఎం నాయకులు షేక్ కరిముల్లా, గోదా రమేష్, రాజశేఖర్ రెడ్డి, కేపీ రంగారావు, భాస్కర్ రావు, మాజేటి సాంబశివరావు, ఆది రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షులు సుమిత్ర, లైన్స్ క్లబ్ అధ్యక్షులు వర ప్రసాద్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నరసరావుపేట జిల్లా సాధన సమితి సభ్యులైన అలెగ్జాండర్ సుధాకర్ గోదా రమేష్ బాబు కరిముల్లా బాబావలి తదితరులు శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ని సన్మానించారు.

Related posts

పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలి

Satyam NEWS

నిన్న కొడుకు..నేడు తండ్రి..కరోనా కాటుకు ఇద్దరూ బలి

Satyam NEWS

కొడుకుని హత్య చేయించిన తల్లిదండ్రులు

Murali Krishna

Leave a Comment