38.2 C
Hyderabad
April 29, 2024 20: 07 PM
Slider జాతీయం

భారత్ లో భారీగా గూగుల్ పెట్టుబడులు

#Sunder Paichai

కరోనా అనంతర పరిస్థితుల్లో దేశం ఆర్ధిక ప్రగతి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ నేడు వర్చువల్ మీటింగ్ లో విస్తృతంగా చర్చించారు. కరోనా అనంతరం దేశం డిజిటల్ గా పురోగమించాల్సిన అవసరం ఉందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి గూగుల్ సంస్థ తీసుకుంటున్న చర్యలను సుందర్ పిచాయ్ ప్రధానికి వివరించారు.

ముఖ్యంగా యువతను, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు డిజిటల్ వ్యవహారాలపై ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని వారు భావించారు. అదే విధంగా దేశ ఆర్ధిక పరిస్థితికి ఊతం ఇచ్చే విధంగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే అంశంపై కూడా భారత ప్రధాని నరేంద్రమోడీతో సుందర్ పిచాయ్ చర్చాంరు.

రాబోయే ఐదేళ్లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా భారత్ లో గూగుల్ సంస్థ 10 బిలియన్ డాలర్ల మేరకు అదనపు పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సందర్ పిచాయ్ ప్రధానికి వివరించారు.  

సెర్చ్ ఇంజన్ ‘గూగుల్‌’ భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ‘డిజిటైజేషన్‌ ఫండ్‌’ కింద ₹75,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్ పిచయ్‌ వెల్లడించారు. రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో భారత్‌లో ఈ పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు.

Related posts

సంచలనం సృష్టించిన చదలవాడ కృష్ణమూర్తి అత్తగారి కిడ్నాప్

Satyam NEWS

ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు:జగన్

Satyam NEWS

ఆదివాసీలకు ఉచిత వైద్యం అందించిన రెడ్ క్రాస్ సంస్థ

Satyam NEWS

Leave a Comment