40.2 C
Hyderabad
April 28, 2024 15: 55 PM
Slider హైదరాబాద్

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ఆయాచితం శ్రీధర్

sridhar

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో  రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దేశ వ్యాప్తంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ నేడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు కోట్ల వరకు మొక్కలు  నాటడం చాలా సంతోషంగా ఉంది. మొక్కలు లేనిదే మానవజాతి మనుగడ లేదని కాబట్టి మొక్కలు నాటడమే కాకుండా పెంచడం కూడ ఒక సామాజిక బాధ్యత గా తీసుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.

హరిత తెలంగాణలో అందరం భాగస్వాములం కావాలని అన్నారు.  ఇందులో భాగంగా ఎం.పి జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ అప్జల్ గంజ్ లోని తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంధాలయం ఆవరణంలో  మూడు మొక్కలు నాటారు. తర్వాత మరో ముగ్గురికి 1. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ వైస్ ఛాన్సలర్ సురేష్  2.ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి 3. రాష్ట్రంలోని 33 జిల్లాల గ్రంధాలయ అధ్యక్షులకు ఈ గ్రీన్ ఛాలెంజ్ ఇస్తున్నానని వారు మొక్కలు నాటాలని వారు కూడా మరో ముగ్గురు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ,  ప్రతినిధి కిషోర్ గౌడ్ , గ్రంథాలయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహులు, రిజిస్టర్ ఆఫ్ DD వెంకటేశ్వరరావు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

మద్యం అమ్మకాల వల్లే పెరుగుతున్న కరోనా

Satyam NEWS

నందమూరి కుటుంబ వివాహానికి పొంగులేటికి ఆహ్వానం

Bhavani

రచయితల సంఘాన్ని బెదిరించిన ఉప సర్పంచ్ భర్త

Satyam NEWS

Leave a Comment