35.2 C
Hyderabad
April 27, 2024 13: 56 PM
Slider ప్రత్యేకం

టెంపుల్ఇష్యూ:ఈ.ఓ కుదిరితే ట్రాన్స్ఫర్ వీలైతే సెలవు

vemulawada e.o krishnaveni transfor leave

అన్ని సక్రమంగా ఉంటేనే ఒక సంస్థను గాడిన పెట్టడానికి ఆరు నెలలు పడుతుంది.అలాంటిది అవినీతికి ,ఉద్యోగుల ఇష్ట రాజ్యానికి,పైరవీలకు ఆలవాలం గా మారిన వేములవాడ రాజన్న దేవాలయాన్ని ఒక గాడిన పెట్టాలంటే సంవంత్సర కాలం పట్టొచ్చు.ఇవేవి తెలియని ఒక ఈ.ఓ, అందులో ఓ మహిళా ,ఆలయానికి అధికారిగా వచ్చింది.పాపం ఎదో చేయాలనే తపన ఏమి చేయలేని నిస్సహాయ స్థితి.

అయినా తక్కువ సమయం లోనే ఆలయాన్ని ఆలయ ఉద్యోగులను ఒక తాటి పైకి తెచ్చి భక్తులకు సౌకార్యాలు అందించేందుకు కష్టపడింది. ఆలయానికి ఆప్రతిష్ట రాకుండా చూడగలిగింది.అవినీతిని అడ్డుకునేందుకు ముక్కు సూటి గా పోయి అందరికి శత్రువుగా మారింది.అంతటా తానూ డ్యూటీ చేయలేక తొందర పడి ఓ కోకిల ముందే కూసినట్లు చెత్త రూపం లో చిత్తయింది.వెరసి ఇక్కడ పనిచేయడం కత్తి మీద సాము లాంటి దాని తెలుసుకుని సెలవుపై వెళ్ళడానికి లేదా ట్రాన్స్ఫర్ చేయించు కోవడానికి సిద్దపడింది.


ఇది ప్రస్తుతం సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈ.ఓ కృష్ణవేణి పరిస్థితి.ఏంతో నిజాయితీ గా ఆత్మ స్థైర్యం తోపనిచేయడానికి వచ్చిన ఆమె ఇటీవల వేములవాడ లో జరిగిన పరిణామాలకు డీలా పడింది.తన ఉద్యోగులను తానె సస్పెండ్ చేసేలా చేసిన పరిస్థితులకు కలత చెందిన ఈ.ఓ తానూ ఇక్కడ పని చేయలేనని తనని బదిలీ చేయాలనీ వేడుకుంటుంది.స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ను కలిసి ఈ విషయమై తెలుపగా తామంతా అండగా ఉంటామని చెప్పినప్పటికీ ఆమె ససేమిరా అంటున్నట్లు సమాచారం.

గురువారం ఉదయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆమె కమిషనర్ అనిల్ కుమార్ ను కలిసి తనను బదిలీ చేయాలని లేదా అదనపు డ్యూటీ నుండి మినహాయించాలని కోరినట్లు తెలిసింది.తన సర్వీస్ లో ఇంత వరకు ఎవరి తో మాట పడలేదని ఒక చిన్న రీమార్క్ లేదని అల్లాంటిది తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కలెక్టర్ మెమో ఇవ్వడం పై , మెమో లు ఇచ్చి చర్యలు తీసుకునే దాకా వెళ్లడం పై ఆమె కంట నీరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.అయితే వివాదం సద్దుమణిగిందని తన డ్యూటీ తానూ చేసుకోవాలని రానున్న రోజుల్లో శివారాత్రి జాతర ఉన్నందున జాతరను విజయ వంతం చేయాలని అయన ఈ.ఓ ను కోరినట్లు తెలిసింది.

పదిహేను రోజుల క్రితమే ఈ.ఓ సెలవు పెట్టగా ఆలయానికి ఈ.ఓ గా పనిచేయడానికి ఆరుగురు అధికారులను అడగగా వారంతా వేములవాడ ఈ.ఓ గా పని చేయడానికి నిరాకరించినట్లు తెలిసింది.చివరకు కరీంనగర్ ఏ.సి ని కోరగా అయన కూడా చేతులెత్తి నమస్కరించినట్లు సమాచారం.సెలవు రద్దు చేసి భక్తుల రద్దీ దృష్ట్యా ఈ .ఓ కృష్ణవేణి నే మల్లి వెనక్కి పిలిపించాగా మున్సిపల్ అధికారి జోక్యం తో కలెక్టర్ తొందర పడటం ఆలయం లో చెత్త వివాదాం చెలరేగడం తెలిసిందే.ఈ నేపత్యం లో కలత చెందిన ఈ.ఓ ఇక్కడినుండి తనను రిలీవ్ చేయాలని లేకుంటే సెలవు ఫై వెళ్లేందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది.

అన్ని బాగుంటేనే శివరాత్రి లాంటి జాతర డ్యూటీ చేయడాం కష్టం కాగా ఉన్నతాధికారులకు అందునా డిస్ట్రిక్ట్ బాస్ తో వివాదం పెట్టుకుని తానూ డ్యూటీ చేయగలనా అనే మీమాంస తోనే ఆలయ ఈ.ఓ వెనకడుగు వేస్తున్నల్టు తెలుస్తుంది.దీనికి తోడు ఇటీవల ఆలయం లో జరుగుతున్నా పరిణామాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఇందులో ఎవరిదీ తప్పు అనే అంశమై విచారణ జరుపుతున్నట్లు తెలియడం తో ఆలయ ఉద్యోగుల్లో భయం నెలకుంది.

గురువారం వేములవాడ నుండి వెళ్లిన ఈ.ఓ తిరిగి ఇక్కడ పనిచేయడానికి రాక పోవచ్చని వదంతులు వెలువడుతున్నాయి.ప్రభుత్వ పెద్దలు ఈ విషయం లో తలదూర్చితే మినహా ఆమె ఇక్కడ పనిచేయడం కష్టమే అని ఆలయ ఉద్యోగులు తెలుపుతున్నారు.చూద్దాం ఎం జరుగుతుందో మరి.

Related posts

సాయి పారాయణం కార్యక్రమానికి హాజరైన మంత్రి ఐకెరెడ్డి

Satyam NEWS

కనకదుర్గ దేవస్థానంలో సస్పెన్షన్ల పర్వం మొదలు

Satyam NEWS

లారీ ఢీకొని యువకుడి మృతి మరొకరికి గాయాలు

Satyam NEWS

Leave a Comment