42.2 C
Hyderabad
April 26, 2024 17: 26 PM
Slider జాతీయం

గులాంనబీఆజాద్ పరువు తీసేసిన కాంగ్రెస్ పార్టీ

#GulamnabiAzad

పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసిన సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. జనరల్ సెక్రటరీ పదవి నుంచి ఆయనను తొలగించారు.

ఆజాద్‌తో పాటు అంబికాసోనీ మోతీలాల్ ఓరా మల్లికార్జున ఖర్గే లను కూడా తొలగించారు. ఏఐసీసీ నుంచి పలువురు సీనియర్లను కాంగ్రెస్ అధిష్టానం తొలగించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

పార్టీ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రశ్నించిన గులాంనబీ ఆజాద్ బిజెపికి లొంగిపోయారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే.

పార్టీ అధినేత్రి ఆసుపత్రిలో ఉన్న సమయంలో లేఖ రాయడం పార్టీ విద్రోహచర్యగానే ఆయన అభివర్ణించారు. వీటన్నింటి దృష్ట్యా గులాంనబీ ఆజాద్ పై చర్య తీసుకున్నట్లే కనిపిస్తున్నది.

యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ప్రియాంక గాంధీని, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మణికం ఠాగూర్ ని, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఊమెన్‌చాం‌దీ ని నియమించారు.

Related posts

పీయూష్ గోయల్ పై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ నోటీస్

Sub Editor 2

సంపూర్ణ ఆరోగ్యానికి తొలి వెయ్యి రోజుల స‌మ‌తుల ఆహార‌మే కీల‌కం

Satyam NEWS

కేంద్ర ఏజెన్సీలను విచ్చలవిడిగా వాడుకుంటున్న బిజెపి

Satyam NEWS

Leave a Comment