32.7 C
Hyderabad
April 26, 2024 23: 06 PM
Slider శ్రీకాకుళం

డాక్టర్ గుండబాల మోహన్ కు గురు స్పందన పురస్కారం

#spandana

శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న డాక్టర్ గుండబాల మోహన్ కు గురు స్పందన పురస్కారం లభించింది. శ్రీకాకుళం పట్టణంలో స్పందన ఈద అంతర్జాతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ట్రెండ్ సదస్సు వేదికపై డాక్టర్ గుండబాల మోహన్ కు గురు స్పందన ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఈ మేరకు ఆయనను శాలువ, అభినందన పత్రం, షీల్డ్ తో సన్మానం చేశారు. ఈ సన్మానాన్ని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి జి. పగడాలమ్మ, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ రోణంకి, జయప్రకాష్, స్పందన ఈద అంతర్జాతీయ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఇదా సామ్యూల్ రెడ్డి, స్పందన ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ జి. దామోదరరావు, డాక్టర్ ఎం. కళ్యాణి, ఎం కృష్ణా రావు, తిరుమల రావు, మొదలైనవారు చేతుల మీదుగా సన్మానం చేశారు. అనంతరం డాక్టర్ గుండబాల మోహన్ మాట్లాడుతూ ఈ  పురస్కారాన్ని ప్రదానం చేసిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ పురస్కారాన్ని రావడం పట్ల పెద్దపాడు ఉన్నత పాఠశాల  ప్రధానోపాధ్యాయిని అమరవాణి , పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ గౌరవ అధ్యక్షులు, జిల్లా ఒలంపిక్ సంఘ కార్యదర్శి పి.సుందర్రావు, శ్రీకాకుళం జిల్లా  వ్యాయామ ఉపాధ్యాయ  సంఘ సభ్యులు అయినా పీవీ రమణ ఎల్ వి రమణ, పి.సాంబమూర్తి, బడి. రమణ, బి. నారాయణ, తవిటయ్య, హరి, వై. వి.పోలినాయుడు, సతీష్ రాయుడు, ఎమ్మెస్సీ శేఖర్, మాధవరావు, రాజారావు, ఎల్ .దిలీప్, వై. రామారావు, కె .నరేష్, సిహెచ్. రాజేశ్వరి, సిహెచ్. శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార క అధికారులైనా బడి. శ్రీనివాసరావు, డాక్టర్. కె .శ్రీధర్ ఆయనకు  శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

బాలకృష్ణ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతి

Satyam NEWS

సొంత డబ్బుతో జర్నలిస్టులను ఆదుకుంటున్న జర్నలిస్టు

Satyam NEWS

కాంట్రాక్టర్ల పై తప్పుడు వార్తలు, ప్రచారాలు మానుకోవాలి

Satyam NEWS

Leave a Comment