37.2 C
Hyderabad
April 26, 2024 20: 40 PM
Slider కవి ప్రపంచం

తాత్త్విక రాజకీయ వేత్త

#K.Veena Reddy

పాలనావిధానంలో న్యాయ

ధర్మానువర్తి

రెంటినీ సమంగా తూచిన సమవర్తి పాములపర్తి

బహు భాషా కోవిదుడైన విద్యాధికుడు

సామాజిక చింతన గల దార్శనికుడు

బహుముఖ వ్యక్తిత్వం గల

తాత్త్వికుడు

అపర చాణక్యుడిగా వాసి గాంచిన ఆర్ధిక వేత్త

ప్రతికూలతలనధిగమించిన

రాజకీయవేత్త

వందేమాతర, తెలంగాణ

పోరాటాల ధ్వని

పలు కీలక పదవుల అనుభవ

ఙ్ఞాని

వైఫల్యాలను సాఫల్యాలనుకున్న మౌని

సరళీకరణలతో ఆర్థిక సంక్షోభాన్నణచిన విఙ్ఞుడు

భావికి దిశానిర్దేశం చేసిన

రాజనీతిఙ్ఞుడు

ముఖ్య మంత్రిగా భూసంస్కరణల రూపకర్త

ప్రధాన మంత్రిగా ఆర్థిక సంస్కరణల వ్యవహార్త

పేదల వసతిగృహ విద్యా

వ్యవస్థలకు ఆది

జాతీయ స్థాయి విద్యా విధానాలకు పునాది

కోరి పదవే తనను వరించిన

ప్రఙ్ఞాశాలి

అనిశ్చిత స్థితిలో దేశాన్నాదుకున్న ధీశాలి

మన మహనీయ నాయకునికివ్వాలి

మన తెలుగు ప్రజల హృదయ నివాళి!

కె. వీణారెడ్డి 7337058025

Related posts

తుది శ్వాస విడిచిన బిజెపి సీనియర్ నేత జైట్లీ

Satyam NEWS

ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు

Bhavani

బాస్మతి బియ్యంపై హక్కుల కోసం పాక్ పోరాటం

Satyam NEWS

Leave a Comment