32.2 C
Hyderabad
May 2, 2024 02: 53 AM
Slider ముఖ్యంశాలు

ఏపిలో ఆ రెండు రోజులూ మందు దొరకదు

#AndhraPradeshSecretariat

పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ నెల 7, 8 తేదీల్లో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఎన్నికల ఏర్పాట్లకు 7న, పోలింగ్‌ కోసం 8న సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంస్థలకు సెలవు ప్రకటిస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలకు కూడా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు

Related posts

కేజీబీవీలో మెరిసిన ఆణిముత్యాలు: సత్తాచాటిన అనాధ బాలికలు

Satyam NEWS

రాచకొండ కమిషనరేట్ లో ఎమర్జెన్సీ సర్వీసు వాహనాలు

Satyam NEWS

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

Satyam NEWS

Leave a Comment