ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజా తీరు చూస్తుంటే పాత సామెత గుర్తుకు వస్తున్నది- మొగుడిని కొట్టి మోసాలు ఎక్కినట్టు. అధికారం కోల్పోయి నేటికి కేవలం 127రోజులు మాత్రమే అయినా కూడా ఆయన బాధ చూస్తుంటే నన్ను ఓడించి ప్రజలు తప్పు చేశారు అంటూ ప్రజల్ని తప్పు పట్టిన మహానేత ఆయన. అందుకే కొత్త ప్రభుత్వం అమలు చేయాలనుకున్న ఏ పధకం వారికి అందకూడదు అన్న దుర్భుద్ధి ఆయన చేష్టలలో కనబడుతోంది.
విద్యుత్ పీపీఏలు, రివర్సు టెండరింగ్, గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఇసుక అమ్మకాలు, కోడెల స్కాములు, ఎగువ ప్రాంతాలలో వర్షాలు పడి ప్రాజెక్టులు నీటితో నిండడం, బెల్ట్ దుకాణాలు మూతపడి పల్లెల్లో ప్రజలు ఆనందంగా ఉండటం వంటి సంఘటనలు ఆయనను తీవ్రమైన మనో వేదనకు గురి చేస్తున్నాయి. మరీ విచిత్రమేమిటంటే ఆయన హయాంలో నిజాయతీ పరులు అయిన అధికారులు ప్రస్తుతం చెడ్డవారు కావటం. శనివారం ఒక పచ్చ పత్రికలో హైదరాబాద్ ఎడిషన్ లో వచ్చిన వార్త చూస్తే ఆయన తీరు చిన్న పిల్లాడి చేష్టలా ఉంది.
విద్యుత్ పీపీఏల విషయంలో కేంద్ర మంత్రి లేఖ ఆధారంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు అజేయకల్లం, పివీరమేష్, శ్రీకాంత్ లపై చర్యులు తీసుకోవాలని బాబు డిమాండ్ చేస్తున్నారని ఆ వార్త సారాంశం. కేంద్ర మంత్రి తో లేఖలు రాయిస్తున్న పచ్చ మనుషులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుత కేంద్ర విద్యుత్ మంత్రి 1999-2004మధ్య కాలంలో ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గాస్ విద్యుత్ ప్రోజెక్టులలో జరిగిన వేలకోట్ల రూపాయలు కుంభకోణం గురించి తెల్సుకోవాలి.
కృష్ణా గోదావరి బేసిన్ లో గాస్ నిల్వలు లేకుండా నాలుగు ప్రాజెక్టులకు అనుమతించిన సిబి నాయుడి గురించి తెలియాలి. 2003 వ సంవత్సరంలో ఆలిపిరి బాంబు దాడికి రెండు రోజులు ముందు శాసన సభలో రెండు రోజులు జరిగిన బిగ్ బాస్ రచ్చ బహుశ ఆయన మర్చిపోయారేమో. ఆనాటి రచ్చలో ప్రధాన వ్యక్తి ప్రస్తుతం సిబినాయుడికి వియ్యంకుడి వరస అయ్యే ఎంఎస్ రామారావు. ఈయన బాబు గారి ఏకైక వియ్యంకుడు బాలకృష్ణ కి వియ్యంకుడు. నాలుగు విద్యుత్ ప్రోజెక్టుల అడ్డగోలు ఒప్పందాలు వల్ల 20వేల కోట్లు ధనం బాంకులు నష్టపోతే అప్పటి ప్రభుత్వ పెద్దలు, బాబుగారి చుట్టాలు వందలు కోట్ల రూపాయలు లబ్ది పొందారు.
కోనసీమ పవర్ ఆర్ధిక వివాదం జాతీయ కంపెనీ లా బోర్డు వద్ద పెండింగ్ ఉంటే, లేని గాస్ తో ఎరువులు కర్మాగారం పెడతానంటే ఇదే రామారావు కు జగ్గయ్యపేట లో 500ఎకరాలు కేటాయించటం తరువాత సీఆర్డీఏ లో కలపటం చినబాబు కనుసన్నలలో యధేచ్ఛగా జరిగినా తప్పు కాదు. జగన్ ప్రభత్వ హయాంలో పీపీఏల సమీక్ష చేస్తానంటే ఎందుకు ఈ సిబి నాయుడికి భయం? అవినీతి కి పాల్పడకపోతే ఎందుకు సమీక్షలు వద్దు అంటున్నారు. సమీక్ష చెస్తే ప్రజలకు ఏంటి నష్టం. మీరు చర్యలు తీసుకోమంటున్న అధికారులు మీ హయాంలో నిజాయతీ గా పనిచేస్తే వారినీ ఏవిధం గా అవమానించారో తెలియంది కాదు.
అజయ్ కల్లాం ను సీఎస్ గా నియమిస్తూ అదే జీవో లో తదుపరి సీఎస్ ను నియమించిన ఘనత తమరిది. అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిన చినబాబు తోడల్లుడు తాత పెట్టిన గీతం మెడికల్ కాలేజ్ విషయంలో అప్పటి ముఖ్య కార్యదర్శి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ను ప్రయిమ్ పోస్టు నుంచి క్రీడాశాఖకు పంపించింది ఎవరో చెప్పనవసరం లేదు. ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెప్పటం లేదు.
ముందు పచ్చ మీడియా రాస్తుంది. తరువాత బాబు ఉవాచ మొదలు అవుతుంది. కేంద్రమంత్రి రాసింది ఏంటి బాబు చెబుతున్నది ఏంటి? వీటిని పరిశీలిస్తే అజేయకల్లం లాంటి నిజాయతి గల అధికారులు జగన్ దగ్గర ఉండ కూడదు. మంచి పాలన ఆయన చేయకూడదు.ఇది చంద్రబాబు రాజకీయం.
ముట్నూరు రామకృష్ణ