టీఆరెస్ ప్రభుత్వం యూనియన్లను, ప్రతిపక్షాలను అవమనిస్తున్నదని సమ్మె వల్ల ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, సాధారణ ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారని టిటిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ విలీనం అంశాన్ని ఆర్టీసీ జేఏసీ పక్కకు పెట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. సీఎస్ రాజకీయాల పార్టీలపై కోర్టులో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ మాత్రం సునీల్ శర్మ మాత్రం రాజకీయ పార్టీల పై విమర్శలు చేస్తున్నారని ఇది దారుణమైన విషయమని అన్నారు. సునీల్ శర్మ ఐఏఎస్ అధికారా? లేదా టీఆరెస్ పార్టీ నేతనా? తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. కోర్టుకు తెలిపిన అఫిడవిట్ లో ప్రతిపక్షాలను టెర్రరైజ్ చేసినట్లు అనిపిస్తుందని ఆయన అన్నారు.