40.2 C
Hyderabad
April 26, 2024 12: 16 PM
Slider నెల్లూరు

ఎర్రచందనం స్మగ్లర్లును పట్టుకున్న నాయుడుపేట పోలీసులు

#RedsandersSmugglers

ఎర్రచందనం దుంగలు తోపాటు స్మగ్లర్లను నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.

బాలయ్య పల్లి గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్ చౌదరి కి సంబంధించిన ఇంటి వెనుక ప్రాంతంలో ఉన్న 65 ఎర్రచందనం దుంగలను నెల్లూరుకు చెందిన సుభాని భాష లోడ్ చేయించి గూడూరు బైపాస్ లో నుండి చెన్నై తీసుకువెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.

పెరంబుర్ కు చెందిన షాహుల్, ఎస్ జలాలుద్దీన్ (32 ), ఒరుసు మొహిద్దిన్ ( 29), ఎం బూహారి (50) టాటా ఐస్ ట్రక్కులో తీసుకుని చెన్నైకి పోతుండగా నాయుడుపేట బీర దవడ, శ్రీనివాసపురం రోడ్డు వద్ద అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రచందనం దుంగలు విలువ సుమారు 17 లక్షల  61,500 రూపాయలు ఉంటుందన్నారు. అలాగే ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద మూడు సెల్ఫోన్లు లక్ష ఏడు వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.

అలాగే ఈ ఎర్రచందనం స్మగ్లర్లను కోర్టుకి హాజరు పరుస్తామని తెలిపారు. ఎవరైనా చట్టవ్యతిరేక అక్రమ కార్యక్రమాలకు పాలు పడితే శిక్ష అర్హులే నని డి.ఎస్.పి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో  నాయుడుపేట సి ఐ వేణుగోపాల్ రెడ్డి ,ఎస్.ఐ దాసరి వెంకటేశ్వరరావు పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

తనిఖీలలో భాగంగా ఎర్రచందనం దొంగలను పట్టుకున్న పోలీసు సిబ్బంది ఐడి పార్టీ డక్కిలి వెంకీ, అన్ను దయాకర్, తిరుపతి నాగయ్య, పి శ్రీను, కానిస్టేబుల్ సిబ్బందికి  డి.ఎస్.పి చేతుల మీదుగా అవార్డ్స్  అందజేసి వారికి అభినందనలు తెలియజేశారు.

Related posts

హారిబుల్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

ఆంధ్రా -ఒడిశా స‌రిహ‌ద్దులో ఇద్దరు మావోల ఎన్ కౌంటర్

Satyam NEWS

హరీషన్నకు అవమానం చేసిన టిటిడి అధికారులు

Satyam NEWS

Leave a Comment