38.2 C
Hyderabad
April 27, 2024 15: 36 PM
Slider ప్రత్యేకం

పెరిగిన విమాన ఛార్జీలు

#fly

మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతాలకు వెళ్లే వారికి విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఖతర్‌ లో ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ పోటీలు ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానున్నాయి. పోటీలు వీక్షించేందుకు ప్రయాణికుల తాకిడి కూడా బాగా పెరిగింది. దుబాయికి టిక్కెట్టు ధర రూ.25 వేల నుంచి రూ.30 వేలవరకుండగా, దోహాకు తిరిగొచ్చేందుకు రూ.46 నుంచి రూ.85 వేలుగా ఉంది. దీంతో హోటళ్ల టారిఫ్‌ కూడా బాగా ఎక్కువైంది. ఈ రెండు దేశాలు ఫుట్‌బాల్‌ పోటీలు తిలకించేందుకు వీలుగా విసా అవకాశాలు కల్పించాయి. ఈ నెలాఖరులో వెళ్లేందుకు చెన్నై నుంచి దోహాకు రూ.46 నుంచి రూ.90 వేల వరకు, దుబాయికి రూ.25 నుంచి రూ.30 వేలు, అబుదాబికి రూ.23 నుంచి రూ.41 వేలు, షార్జాకి రూ.23 నుంచి రూ.27 వేలు, దమామ్‌కి రూ.26 నుంచి రూ.29 వేలు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ‘ఎఫ్‌ఐఎఫ్‌ఏ’ వరల్డ్‌ కప్‌ పోటీలు 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. యూఏఈ, సౌదీలో విసాలో బాగా సడలింపులు చేసిన నేపథ్యంలో ఎక్కువ మంది యూఏఈ కానీ,  సౌదీలో కానీ దిగి అక్కడినుంచి ఖతర్‌కు వెళ్లేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

Related posts

మంగళగిరి కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

Satyam NEWS

కండిషన్స్అప్లై: ఆ రెండు షరతులు ఒప్పుకుంటేనే

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్ :చైనాలో జంతువులు మాంసం లపై నిషేధం

Satyam NEWS

Leave a Comment