32.7 C
Hyderabad
April 27, 2024 02: 28 AM
Slider జాతీయం

అపోహలు వీడండి.. క‌రోనా… పై పోరాడండి …!

#coronavaccine

క‌రోనా సెకండ్ వేవ్ తో  దేశం అల్లాడుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సగానికిపైగా రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ వైపే మొగ్గు చూపాయి. ఇటు ఏపీ రాష్ట్రంలో కూడా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా వైరస్ ప్రభావానికి గురై కొందరు, ఆక్సిజన్ అందక మరికొందరు ఇలా రోజుకు  వేలాది మంది మరణిస్తున్నారు. క‌రోనా వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ అనేకమందికి క‌రోనా వైరస్ పై పూర్తిగా అవగాహన ఉండడం లేదు. దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడంతో సోషల్ మీడియాలో వస్తున్న సూచనలు, సలహాలను పాటిస్తూ కొందరు, మరింకొందరైతే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మరి చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు భయంతో అవసరం లేకపోయినా సీటీస్కాన్‌ల కోసం ల్యాబ్‌ల వద్దకు బారులుదీరుతున్నారు. ఈ నేప‌ధ్యంలో హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) నిపుణుల బృందం కోవిడ్ ను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజలందరికీ ఉపయోగపడేలా ఒక బుల్ లెట్ ను తయారు చేశారు.ఈ మేర‌కు ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, డైరెక్టర్‌ డాక్టర్ జి.వి.రావులు కొన్ని సూచ‌న‌లు చేసారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆస్పత్రుల్లో గత ఏడాది కాలంగా 20వేల మందికిపైగా కోవిడ్ వచ్చినవారికి విజయవంతంగా చికిత్స అందించిన అనుభవంతో ఈ బుక్ లెట్ తయారు చేశారు. ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు ప్రజలకు క‌రోనా పై అవసరమైన అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఇక్కడ ఇచ్చినవన్నీ వైద్య చికిత్సలకు ప్రత్యామ్నాయం కాదని.. మీకు క‌రోనా లక్షణాలు ఉన్నట్టయితే వైద్యులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.

సెకండ్ వేవ్ సునామీ:

అత్యధికంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించడం

మరింత తీవ్రతగలది

ఎక్కువగా యువతలో పెరిగిన కేసులు

నిరంతరం జ్వరంగా ఉండడం

రాబోయే రోజుల్లో కేసులు 50 లక్షలు దాటినపుడు కూడా తట్టుకునేలా ఏర్పాట్లు చేసుకోవడం

ప్రస్తుత యాక్టివ్ కేసుల లోడ్ ను అరికట్టడం

టెస్టు – ఐసోలేట్ – ట్రీట్

తక్కువ లక్షణాలున్న కేసులను ఇంట్లోనే మేనేజ్ చేసుకోగలడం

ఆస్పత్రికి తరలించడంలో అలసత్వం ఉండకూడదు

స్వీయ నిర్బంధం చేసుకోవడం

వ్యాక్సిన్ తీసుకోవడం

పరీక్ష.. ఐసొలేషన్‌, చికిత్స

కరోనా లక్షణాలు ఎలా ఉంటాయన్నదానిపై ఇప్పటికీ చాలామందికి అనుమానాలు తొలగలేదు. తొలి విడతలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, పొడి దగ్గు మాత్రమే ఉండేవి. కానీ రెండో విడతలో  వీటితో పాటు అనేక కొత్త లక్షణాలు బయట పడుతున్నాయి.

అవి ఏంటంటే..

జ్వరం   

దగ్గు

ఆయాసం

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది

కండరాల నొప్పులు

చలి జ్వరం

తలనొప్పి, గొంతు నొప్పి

వాసన, రుచి కోల్పోవటం

ముక్కు దిబ్బడ, ముక్కు కారడం

వాంతులు, విరేచనాలు

ఇందులో ఒకటి లేదా అంతకుమించిన లక్షణాలు ఉంటే కొవిడ్‌గా అనుమానించాలి.

వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఐసొలేషన్‌లోకి వెళ్లాలి.

పాజిటివ్‌గా తేలితే చికిత్స ప్రారంభించాలి.

వైరస్ ను గుర్తించడానికి ఉన్న మార్గాలు:

ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఉత్తమైనది

ఒకవేళ మీదగ్గరలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు అందుబాటులో లేనట్టయితే పరీక్ష ఫలితాలు ఆలస్యమైన సందర్భాల్లో సీటీస్కాన్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు.

ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలో కచ్చితత్వం తక్కువ. నెగెటివ్‌ వచ్చినా ధీమా పనికిరాదు. మళ్లీ ఆర్టీసీఆర్‌ తప్పనిసరిగా చేయించాలి.

ఒకవేళ ర్యాపిడ్‌ టెస్టులోనే పాజిటివ్‌ వస్తే కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయినట్టే.

ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

వోట్ బ్యాంకు:టీఆర్​ఎస్​ పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష

Satyam NEWS

సమ్మక్క సారలమ్మలకు బంగారం సమర్పించిన సీతక్క

Satyam NEWS

‘‘జగనన్న క్యాంటిన్’’ అని పేరు పెట్టుకుని అన్న క్యాంటిన్లను తెరవండి

Satyam NEWS

Leave a Comment