30.2 C
Hyderabad
February 9, 2025 19: 32 PM
Slider ప్రపంచం

సిఏఏ, ఆర్టికల్ 370 పై సౌదీలో ఇస్లామిక్ దేశాల మీటింగ్

pakistan

జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తరువాత జరిగిన పరిణామాలను అంచనా వేసేందుకు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసి) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషితో జరిగిన సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్-సౌద్ ఈ విషయం చెప్పారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.

జమ్మూ కాశ్మీర్ పరిస్థితులను అంచనా వేయడానికి ఈ సమావేశాన్ని ఓఐసి సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ముందుకు రావడాన్ని పాకిస్తాన్ పూర్తిగా సమర్థించింది. సౌదీ విదేశాంగ మంత్రితో జరిగిన సమావేశంలో కాశ్మీర్ సమస్యతో పాటు భారత పౌరసత్వ సవరణ చట్టంపైనా, ఎన్‌ఆర్‌సి పైన కూడా చర్చించామని ఖురేషి అన్నారు. ఈ పరిణామాలు భారత్, సౌదీ మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుందని పలువరు భావిస్తున్నారు.

Related posts

ఈ నెల 12 విజ‌య‌వాడ లో అన్ని విద్యార్ధి సంఘాల‌తో మ‌హా ధ‌ర్నా…!

Satyam NEWS

సీపీఎస్ ఇచ్చిన మాట తప్పారా…. పూర్తిగా మరిచారా …?

Satyam NEWS

చికిత్స పూర్తి కాకుండానే చేతులు దులుపుకున్నారు

Satyam NEWS

Leave a Comment