తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇక ముగిసింది. ఎలాంటి షరతులు లేకుండా తమను ఉద్యోగాలలోకి తీసుకుంటే వచ్చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామరెడ్డి వెల్లడించారు. హైకోర్టు తీర్పు కాపీ ఈ రోజు మాకు అందింది ..దాని పై చర్చించాం…హైకోర్టు లేబర్ కోర్ట్ కు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నాం…ప్రభుత్వం కూడా తీర్పు ను గౌరవిస్తుందని ఆశిస్తున్నాం…అని ఆయన అన్నారు. కార్మికుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యం, ప్రభుత్వం పై ఉందని అశ్వథామరెడ్డి అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికుల ను విదుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. షరతులు లేకుండా విధులకు ఆహ్వానించాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.ప్రభుత్వం షరతులు లేకుండా ఆహ్వానిస్తే సమ్మె విరమించడానికి సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. సమస్యలను లేబర్ కోర్ట్ పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని, సమ్మె కాలానికి జీతాల విషయాన్ని లేబర్ కోర్ట్ లో లేవనెత్తుతామని ఆయన అన్నారు.
previous post