ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ నూతన చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన జక్కంపూడి రాజా కాపు, ఒంటరి, బలిజ, తూర్పుకాపు కులస్తులకు కొత్త ఆశాజ్యోతి అని కాపు జాగ్రతి గ్రేటర్ కన్వీనర్ కె.లలిత్ కుమార్ అన్నారు. ఎంతో కీలకమైన సమయంలో క్లిష్టమైన బాధ్యతలు చేపట్టిన జక్కంపూడి రాజా కాపు సామాజిక వర్గ అవసరాలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఎంతో కీలకమైన బాధ్యతలను యువకుడైన జక్కంపూడి రాజాకు అప్పగించడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పగించడం హర్షణీయమని లలిత్ కుమార్ అన్నారు. మంచి నాయకత్వాన్ని కాపు సామాజిక వర్గానికి అందిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం కాపులందరికి సంతోషదాయకం అని ఆయన అన్నారు. దివంగత జక్కంపూడి రామ్మోహనరావు వారసుడిగా జక్కంపూడి రాజా మెరుగైన పనితీరుతో రాణించాలని లలిత్ కుమార్ ఆకాంక్షించారు. ప్రజాభిమానం సంపాదించడంలో జక్కంపూడి రామ్మోహనరావు బాటలోనే రాజా కూడా నడవాలని, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలని సూచించారు.
previous post
next post