42.2 C
Hyderabad
April 26, 2024 15: 59 PM
Slider నిజామాబాద్

జిగేల్ మనే వెలుగులతో మురిసిన భీంగల్

జిగేల్ మనే వెలుగు జిలుగులతో నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణం మెరిసి, మురిసింది.సెంట్రల్ లైటింగ్ తో నూతన శోభను సంతరించుకున్నది. మూడు కిలోమీటర్ల మేర నెత్తి మీద బోనాలతో భీంగల్ మహిళలు మంత్రికి అపూర్వ స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోలాహలం నడుమ అట్టహాసంగా సెంట్రల్ లైటింగ్,రోడ్ డివైడర్,డబుల్ రోడ్డు పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. భీంగల్ పట్టణం సుమారు 75 కోట్లతో అభివృద్ది చేసుకుంటున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్,మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భీంగల్ ప్రజలు 12 కు 12 మంది టిఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపించి అభివృద్ది కోరుకున్నారని,వారికి రుణపడి ఉంటానని మంత్రి అన్నారు. 35 కోట్లతో వంద పడకల హాస్పిటల్ 25 కోట్లతో మున్సిపల్ అభివృద్ది, వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫంక్షన్ హాల్,సెంట్రల్ లైటింగ్,రోడ్ డివైడర్,డబుల్ రోడ్డు,సి సి రోడ్లు,డ్రైన్లు ఇలా అన్ని విధాల భీంగల్ పట్టణం అభివృద్ది చేసుకుంటున్నామని వెల్లడించారు. ఇవాళ భీంగల్ వెలుగులు చూస్తుంటే తనకు ఎంతో సంతోషం కలుగుతుందని,తను కలలు గన్న భీంగల్ అభివృద్ది,ప్రజల ఆదరాభిమానాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే చెప్పరాని ఆనందం అనిపిస్తుందన్నారు.రానున్న రోజుల్లో భీంగల్ ను మరింత సుందర పట్టణంగా తీర్చి దిద్దుతానని మంత్రి స్పష్టం చేశారు.

Related posts

అవసరం మేరకు కేటాయింపులు

Murali Krishna

అనంతపురం జిల్లా మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

గుడ్ ఇనీషియేటీవ్: మహిళా పోలీసులకు మొబైల్ వాష్ రూం

Satyam NEWS

Leave a Comment