ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉపకరించే విధంగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున జాబ్ మేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన నరసరావుపేటలోని టౌన్ హాల్ లో ఉదయం 9 గంటలకు ఈ జాబ్ మేలా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని వచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చునని నరసరావుపేట మునిసిపల్ కమిషనర్ కె.శివారెడ్డి తెలిపారు. అర్హులైన నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని ఆయన వెల్లడించారు. నిరుద్యోగులు తమ అర్హత సర్టిఫికెట్లతో హజరు రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
previous post