42.2 C
Hyderabad
April 26, 2024 17: 00 PM
Slider నిజామాబాద్

కరోనా కష్టకాలం లో ప్రభుత్వం జర్నలిస్ట్ లను ఆదుకోవాలి

#CPM Kamareddy

గత సంవత్సరం మొదలైన ప్రాణంతక కరోనా మహమ్మారి వైరస్ కారణంగా తెలంగాణ లో అసువులు బాసిన జర్నలిస్ట్ లను ప్రభుత్వo ఆదుకోవాలని సి పి ఎం కామారెడ్డి జిల్లా జుక్కల్ జోన్ కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులందరు ప్రభుత్వం ఇచ్చే వేతనాలు తీసుకుంటూ సరిగా విధులు నిర్వహించకున్నా వారందరికీ క్రమం తప్పకుండ నేలనేలా వేతనాలు చెల్లిస్తున్నారని ఆయన అన్నారు. సమాజం లో జరుగుతున్న అన్యాయంపై అవిశ్రాంతంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్న ఎందరో జర్నలిస్ట్ లకు కనీసం ఈ విపత్కర పరిస్థితి లో నైనా ప్రభుత్వాలు అండగా ఉండాలని ఆయన కోరారు.

విధులు నిర్వహిస్తున్న ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 50 లక్షల ఇన్సూరెన్స్, ప్రతి నేల 7వేల రూపాయలు, నెల నెలా నిత్యావసర సరకులు, ఆరోగ్య రక్షణ కోసం ఆరోగ్య కిట్, లను ఇచ్చి ఆదు కోవాలని ప్రభుత్వానికి చేశారు. వ్యాపారమే ముఖ్యమని భావించే ప్రింట్, ఎలక్ట్రానిక్ సంస్థలు సైతం ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రతి జర్నలిస్ట్ లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

నేతల సెటిల్ మెంట్స్ – బంధువుల భూ పంచాయతీలు

Satyam NEWS

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై  మంద కృష్ణ  విమర్శలు

Satyam NEWS

దమ్ముంటే చంద్రబాబు నాయుడు సవాల్ ను స్వీకరించండి

Satyam NEWS

Leave a Comment